Telugu Global
National

కార్యకర్తలకు మాయావతి ఓదార్పు.... నేను పోటీ చేయకపోయినా ప్రధాని అవుతా !

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే విషయాన్ని నిన్న మీడియాకు వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని యూపీలో పోటీ చేస్తున్న బీఎస్పీ.. తమ అధినేత ఎన్నికల రంగంలో లేదనే విషయం తెలియడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. బెహెన్‌జీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పీఎం ఎలా అవుతారని.. మిగతా అభ్యర్థులకు కూడా మానసిక స్థైర్యం సన్నగిల్లుతుందని బాధపడ్డారు. దీంతో నష్ట నివారణకు మాయావతి రంగంలోకి దిగారు. […]

కార్యకర్తలకు మాయావతి ఓదార్పు.... నేను పోటీ చేయకపోయినా ప్రధాని అవుతా !
X

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే విషయాన్ని నిన్న మీడియాకు వెల్లడించారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని యూపీలో పోటీ చేస్తున్న బీఎస్పీ.. తమ అధినేత ఎన్నికల రంగంలో లేదనే విషయం తెలియడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.

బెహెన్‌జీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పీఎం ఎలా అవుతారని.. మిగతా అభ్యర్థులకు కూడా మానసిక స్థైర్యం సన్నగిల్లుతుందని బాధపడ్డారు. దీంతో నష్ట నివారణకు మాయావతి రంగంలోకి దిగారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సందేశాన్ని పంపి కార్యకర్తలకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు. తాను పోటీలో లేకపోయినా ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

మాయావతి చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. “తాను తొలిసారి యూపీకి సీఎం అయినప్పుడు ఎమ్మెల్యేను గానీ ఎమ్మెల్సీని కాని కాదని, అలాగే ప్రధాని అయ్యే వ్యక్తి రాజ్యసభ లేదా లోక్‌సభ సభ్యుడై ఉండాల్సిన అవసరం లేదు. ఆరు నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యుడుగా ఎన్నికైతే చాలు. నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని బాధపడకండి. కేవలం లోక్‌సభకు పోటీ చేయవద్దనే నిర్ణయం తాత్కాలికమే” అని పేర్కొన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీయే గానీ యూపీయే గాని మెజార్టీ సీట్లు గెలుచుకోలేదని.. తృతీయ ఫ్రంట్ ద్వారా మాయావతి ప్రధాని అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాయావతికి ఎస్పీ మద్దతు తెలిపింది. ఎన్నికల ఫలితాల అనంతరం మరింత మంది మాయావతికి మద్దతు తెలుపుతారనే ఆశాభావంలో బీఎస్పీ ఉంది.

First Published:  21 March 2019 1:55 AM GMT
Next Story