Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగేనా?

కాంగ్రెస్ పార్టీ. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రజల గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న పార్టీ. పార్టీ అధ్యక్షురాలు ఇందిరా గాంధీని తెలుగు సమాజానికి తల్లిగా భావించి ఇందిరమ్మ గా పిలుచుకున్న తెలుగు ప్రజల పార్టీ. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికి బట్ట కట్టడానికి రెండు మూడు దశాబ్దాలు పడుతుందని ముందుగానే నిర్ణయించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే అభిమానం తెలంగాణ ప్రజల్లో […]

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగేనా?
X

కాంగ్రెస్ పార్టీ. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు ప్రజల గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న పార్టీ. పార్టీ అధ్యక్షురాలు ఇందిరా గాంధీని తెలుగు సమాజానికి తల్లిగా భావించి ఇందిరమ్మ గా పిలుచుకున్న తెలుగు ప్రజల పార్టీ. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

సమైక్య రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికి బట్ట కట్టడానికి రెండు మూడు దశాబ్దాలు పడుతుందని ముందుగానే నిర్ణయించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే అభిమానం తెలంగాణ ప్రజల్లో ఉంటుందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుని అధికారాన్ని కట్టబెడతారని ఆశించింది. కాంగ్రెస్ పార్టీ ఒకటి తలిస్తే తెలుగు ప్రజలు మరొకటి తలిచారు అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ…. తెలంగాణలో కూడా మెల్లిమెల్లిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి.

గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోతున్నారు. వీరితో పాటు పార్టీలో సీనియర్ నాయకులు అనుకుంటున్న డీకే అరుణ సహా మరికొందరు నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైన తరుణంలో సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, వి.హనుమంత రావు, సర్వే సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు అటు తెలంగాణ రాష్ట్ర సమితిలో గానీ ఇటు బీజేపీ లో కానీ చేరేలా ఉన్నారు.

పార్టీ సీనియర్ నాయకులే కాంగ్రెస్ పార్టీని వీడుతూండడంతో కార్యకర్తలు కూడా చెల్లా చెదురవుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఒకనాడు రాజ్యమేలిన కాంగ్రెస్ పార్టీ నేడు నాయకులు లేక దిక్కులు చూసే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఈ పరిస్థితికి కారణం సోనియా గాంధీకి భారత రాజకీయాల గురించి ఓనమాలు తెలియకపోవడం…. రాహుల్ గాంధీకి భారత రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం అంటున్నారు. రాష్ట్రాన్ని విడదీసిన దానికన్నా రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల సోనియా కుటుంబం వ్యవహరించిన తీరును తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. దీన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ తెలివిగా పావులు కదపడం ద్వారా కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టారు.

First Published:  20 March 2019 2:57 PM IST
Next Story