అనుకున్నట్లే జరిగింది.... జనసేన, టీడీపీ బంధం బలపడింది
ముందునుంచి అనుకున్నట్లే జరిగింది. టిడీపీతో జనసేన దోస్తీ మరింత బలపడింది. దీన్నినిజం చేసే దిశగానే సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆరంభం నుంచీ టిడీపీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై ప్రచారం కూడా జరిగింది. కానీ దీన్ని కాదని నమ్మించేందుకు పవన్ కళ్యాణ్…. అటు చంద్రబాబు పైనా, లోకేష్ పైనా అనేక రకాల ఆరోపణలు చేశారు. తాను ఒంటరిగానే బరిలోకి వెళతానని, అన్ని స్థానాల్లోనూ ఒంటిరిగానే పోటీ చేస్తానాని నమ్మించారు. జనసైన్యం దాటికి […]
ముందునుంచి అనుకున్నట్లే జరిగింది. టిడీపీతో జనసేన దోస్తీ మరింత బలపడింది. దీన్నినిజం చేసే దిశగానే సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆరంభం నుంచీ టిడీపీ, జనసేనలు కలిసే పోటీ చేస్తాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై ప్రచారం కూడా జరిగింది. కానీ దీన్ని కాదని నమ్మించేందుకు పవన్ కళ్యాణ్…. అటు చంద్రబాబు పైనా, లోకేష్ పైనా అనేక రకాల ఆరోపణలు చేశారు.
తాను ఒంటరిగానే బరిలోకి వెళతానని, అన్ని స్థానాల్లోనూ ఒంటిరిగానే పోటీ చేస్తానాని నమ్మించారు. జనసైన్యం దాటికి ఎవరూ తట్టుకోలేరని కూడా పేర్కొన్నారు. కానీ రోజులు గడిచిన కొద్దీ, ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో అసలు రూపం బయటపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన రహస్య చర్యలు, ఒప్పందాల వల్లనే సీట్ల పంపిణీ జరిగినట్లు చెపుతున్నారు.
టీడీపీ బలంగా ఉన్నచోట్ల జనసేన నామమాత్రంగా వ్యవహరించాలి. వైసీపీ బలంగా ఉన్న చోట ఓట్లు చీల్చాలి. ఓట్లు చీల్చే విధంగా అభ్యర్ధులను నిలబెట్టాలి. టీడీపీకి మేలు జరిగేలా చూడాలి. వైసిపి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచేలా చేయకూడదు. ఇదే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు, పవన్‌లు ప్రస్తుత ఎన్నికల్లో పనిచేస్తున్నారు. అందుకే జనసేన ఇంకా సీట్ల సర్దుబాటులో కావాలని వెనుకబడి ఉంది.