ఎన్నికల బరిలో టీమిండియా క్రికెటర్ భార్య
బీజెపీ నుంచి పోటీకి రవీంద్ర జడేజా భార్య రివాబా సిద్ధం జామ్ నగర్ లోక్ సభ స్థానానికి రివాబా దరఖాస్తు హార్థిక్ పటేల్ తో సమరానికి రివాబా సై… టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా…ఎన్నికల బరిలో దిగటానికి తహతహలాడుతోంది. ఇప్పటికే బీజెపీ తీర్థం పుచ్చుకొన్న రివాబా…ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని సైతం మర్యాదపూర్వకంగా కలసి వచ్చింది. వచ్చే నెల ప్రారంభమయ్యే లోక్ సభ ఎన్నికల్లో …జామ్ నగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి […]
- బీజెపీ నుంచి పోటీకి రవీంద్ర జడేజా భార్య రివాబా సిద్ధం
- జామ్ నగర్ లోక్ సభ స్థానానికి రివాబా దరఖాస్తు
- హార్థిక్ పటేల్ తో సమరానికి రివాబా సై…
టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా…ఎన్నికల బరిలో దిగటానికి తహతహలాడుతోంది. ఇప్పటికే బీజెపీ తీర్థం పుచ్చుకొన్న రివాబా…ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని సైతం మర్యాదపూర్వకంగా కలసి వచ్చింది.
వచ్చే నెల ప్రారంభమయ్యే లోక్ సభ ఎన్నికల్లో …జామ్ నగర్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, పాటిదార్ నేత హార్దిక్ పటేల్‌తో సమరానికి రివాబా సై అంటోంది.
కర్నీసేన మహిళా విభాగం నేతగా….
రివాబా కు..గుజరాత్‌లోని కర్నిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు… క్షత్రియ వర్గాల మద్దతుతో మార్చి నెల మొదటివారంలో భాజపాలో చేరారు.
జామ్ నగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజెపీ నాయకురాలు పూనమ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్.. ప్రముఖ కాంగ్రెస్ నేత, తన బంధువైన విక్రమ్ మాదమ్‌పై విజయం సాధించారు.
మోదీకి ప్రతిష్టాత్మకం
ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో బీజెపీ తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 26 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకొంది.
రానున్న ఎన్నికల్లోనూ బలమైన నాయకులను దింపి మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలని కమలనాథులు వ్యూహాలు సిద్ధం చేసుకొన్నారు. ఇంతకూ క్రికెటర్ జడేజా భార్యకు బీజెపీ టికెట్ ఇస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.