లండన్‌లో నీరవ్ మోడీ అరెస్టు
పీఎన్‌బీ బ్యాంకును 13 వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన వజ్రాల వ్యాపారిని లండన్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. లండన్ కోర్టు ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు. భారత ఈడీ, సీబీఐ అధికారుల పిర్యాదు మేరకు గతంలోనే వెస్ట్‌మినిస్టర్ కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే అతను ఎక్కడ ఉన్నాడనే దానిపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో నీరవ్ మోడీ గత వారం ది […]
పీఎన్‌బీ బ్యాంకును 13 వేల కోట్ల రూపాయలకు మోసం చేసిన వజ్రాల వ్యాపారిని లండన్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. లండన్ కోర్టు ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరు పరిచారు.
భారత ఈడీ, సీబీఐ అధికారుల పిర్యాదు మేరకు గతంలోనే వెస్ట్‌మినిస్టర్ కోర్టు వారెంట్ జారీ చేసింది. అయితే అతను ఎక్కడ ఉన్నాడనే దానిపై సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో నీరవ్ మోడీ గత వారం ది టెలిగ్రాఫ్ పత్రిక రిపోర్టర్ కంటపడ్డాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
దీంతో అప్రమత్తమైన భారత అధికారులు వెంటనే లండన్ కోర్టును సంప్రదించి అతని అరెస్టుకు రంగం సిద్దం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ అతనిని అరెస్టు చేశారు. త్వరలోనే నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాగా, నీరవ్ మోడీతో పాటు అతని మామ మోహుల్ చోక్సీ కూడా బ్యాంకులను మోసం చేసి పారిపోయాడు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశ పౌరసత్వం తీసుకొని అక్కడే ఉంటున్నాడు. అతనిని కూడా దేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.