Telugu Global
NEWS

లోకేష్ ముందు చూపు !

”ఇప్పుడు పోటీ చేస్తున్న సీనియర్లలో కొంతమందికి పార్టీ టిక్కెట్లే రావనుకున్నాను. నా అంచనా తప్పి చివరికి వాళ్ళకు టిక్కెట్లు వచ్చాయి. నేను భవిష్యత్తులో బలపడాలంటే వీళ్ళల్లో కొందరు సీనియర్లు ఓడిపోతే మంచిది. లేకపోతే భవిష్యత్తులో వారంతా నాకు గుదిబండలా మారతారు” ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుల వద్ద చెబుతున్న మాటలని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ముగ్గురు […]

లోకేష్ ముందు చూపు !
X

”ఇప్పుడు పోటీ చేస్తున్న సీనియర్లలో కొంతమందికి పార్టీ టిక్కెట్లే రావనుకున్నాను. నా అంచనా తప్పి చివరికి వాళ్ళకు టిక్కెట్లు వచ్చాయి. నేను భవిష్యత్తులో బలపడాలంటే వీళ్ళల్లో కొందరు సీనియర్లు ఓడిపోతే మంచిది. లేకపోతే భవిష్యత్తులో వారంతా నాకు గుదిబండలా మారతారు” ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుల వద్ద చెబుతున్న మాటలని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులు ఓటమి పాలు కావాలని నారా లోకేష్ కోరుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన తండ్రి చంద్రబాబు నాయుడు రిటైర్ మెంటు వయసు దగ్గర పడడం…. ముందు ముందు తానే పార్టీలో సర్వస్వం కావాలంటే సీనియర్ల నుంచి ఇబ్బందులు రాకూడదని లోకేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఏ నిమిషంలోనైనా ఏమైనా చేయగల రాజకీయ దురంధురులని, రానున్న ఎన్నికలలో వారు ఓటమి పాలైతే తనకు ఇబ్బందులు రావని లోకేష్ సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో సీనియర్ నాయకులైన యనమల రామక్రిష్ణుడు, అశోక గజపతిరాజు, కెఇ క్రిష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, అచ్చంనాయుడు…. వంటి వారితో భవిష్యత్తులో తనకు ఇబ్బందులు వస్తాయని లోకేష్ అంచనా వేసినట్లు చెబుతున్నారు.

పైగా సీనియర్ నాయకులలో ఎక్కువ మంది బిసీ వర్గాలకు చెందిన వారు కావడంతో వారి నుంచి ఎప్పటికైనా ముప్పు ఉంటుందని లోకేష్ సందేహిస్తున్నారని అంటున్నారు. ఈ ఎన్నికలలో సీనియర్లు కొందరు ఓడిపోతే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు ఎదురుకావని లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు.

First Published:  20 March 2019 7:00 AM IST
Next Story