గోరంట్ల మాధవ్‌కు లైన్ క్లియర్
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీకి వీలుగా ఆయన ఇటీవల పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే అతడి రాజీనామాను ఆమోదించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. నామినేషన్ చెల్లుబాటు కాకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు మాధవ్ రాజీనామాను పెండింగ్‌లో పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాధవ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ట్రిబ్యునల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. వెంటనే గోరంట్ల మాధవ్ రాజీనామాను ఆమోదించాలని ఆదేశించింది. దీంతో గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో […]
వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీకి వీలుగా ఆయన ఇటీవల పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు.
అయితే అతడి రాజీనామాను ఆమోదించకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. నామినేషన్ చెల్లుబాటు కాకుండా ఉండేందుకు
ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు మాధవ్ రాజీనామాను పెండింగ్‌లో పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మాధవ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీంతో ట్రిబ్యునల్ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. వెంటనే గోరంట్ల మాధవ్ రాజీనామాను ఆమోదించాలని ఆదేశించింది. దీంతో గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూట్ క్లియర్ అయింది.