Telugu Global
Cinema & Entertainment

ధర్మాన్ని గాలికొదిలేసిన తేజూ

హెడ్డింగ్ చూసి తప్పుగా అర్థంచేసుకోవద్దు. తన పేరులో ధరమ్ అనే పదాన్ని మాత్రం సాయిధరమ్ తేజ్ వదిలించుకున్నాడు. అవును.. ఇకపై సాయిధరమ్ తేజ్ ను కేవలం సాయి తేజ్ అని మాత్రమే పిలవాలి. టైటిల్స్ నుంచి కూడా ధరమ్ ను లేపేస్తున్నారు. అవును.. చిత్రలహరి సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు సాయిధరమ్ తేజ్. ఇప్పటికే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు తేజూ. వరుసగా అరడజను ఫ్లాపులిచ్చాడు. ఇప్పుడు చిత్రలహరి పైనే ఆశలు పెట్టుకున్నాడు. పనిలోపనిగా […]

ధర్మాన్ని గాలికొదిలేసిన తేజూ
X

హెడ్డింగ్ చూసి తప్పుగా అర్థంచేసుకోవద్దు. తన పేరులో ధరమ్ అనే పదాన్ని మాత్రం సాయిధరమ్ తేజ్ వదిలించుకున్నాడు. అవును.. ఇకపై సాయిధరమ్ తేజ్ ను కేవలం సాయి తేజ్ అని మాత్రమే పిలవాలి. టైటిల్స్ నుంచి కూడా ధరమ్ ను లేపేస్తున్నారు. అవును.. చిత్రలహరి సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు సాయిధరమ్ తేజ్.

ఇప్పటికే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు తేజూ. వరుసగా అరడజను ఫ్లాపులిచ్చాడు. ఇప్పుడు చిత్రలహరి పైనే ఆశలు పెట్టుకున్నాడు. పనిలోపనిగా జాతకాలు, సెంటిమెంట్స్ కూడా వచ్చి పడ్డాయి. అలా ఎవరో చెప్పిన సూచన మేరకు చిత్రలహరి సినిమాలో తన పేరును కేవలం సాయి తేజ్ అని మాత్రమే వేసుకుంటున్నాడు.

ఈరోజు ఈ సినిమాకు సంబంధించి ఓ సింగిల్ రిలీజైంది. పాట ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఆ వీడియో టైటిల్స్ లో కూడా సాయిధరమ్ తేజ్ పేరును కేవలం సాయితేజ్ గానే వ్యవహరించారు. ఇకపై మనం కూడా ఇంటర్వ్యూల్లో ఇలానే పిలవాలేమో.

మొన్నటికిమొన్న ఆది కూడా తన పేరు మార్చుకున్నాడు. ఆది సాయికుమార్ అని పెట్టుకున్నాడు. ఇది కూడా అలాంటి మార్పే కావొచ్చు. ఇక లిరికల్ వీడియో విషయానికొస్తే మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎప్పట్లానే ఈ పాటకు కూడా రొటీన్ ట్యూన్ కొట్టాడు. మాటలు మాట్లాడినట్టు పాటను అల్లుకుంటూ పోయాడు. ఈ శైలిలో ఇప్పటికే ఓ డజను పాటలు కంపోజ్ చేసి ఉంటాడు ఈ సంగీత దర్శకుడు. అంత రొటీన్ గా ఉంది ఈ పాట.

First Published:  20 March 2019 12:32 AM IST
Next Story