భరత్ ను ఓడించేందుకు చంద్రబాబు వ్యూహరచన!
చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల కోసం తనా.. పరా భేదం లేకుండా ఎవరినైనా దెబ్బ కొట్టడానికి వెనుకాడని వ్యూహకర్త. తన రాజకీయ జీవితానికి అడ్డం వచ్చిన వారందరినీ ఇలా ఒక్కొక్కరిగా ఏరి పారేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని తన కుమారుడి కోసం చేపడుతున్నారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదలకు ఎదురు వచ్చే వారందరినీ ఒక్కొక్కరిగా తప్పించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. తన కుమారుడు […]
చంద్రబాబు నాయుడు ఫక్తు రాజకీయ నాయకుడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయాల కోసం తనా.. పరా భేదం లేకుండా ఎవరినైనా దెబ్బ కొట్టడానికి వెనుకాడని వ్యూహకర్త. తన రాజకీయ జీవితానికి అడ్డం వచ్చిన వారందరినీ ఇలా ఒక్కొక్కరిగా ఏరి పారేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పనిని తన కుమారుడి కోసం చేపడుతున్నారు.
తన కుమారుడి రాజకీయ ఎదుగుదలకు ఎదురు వచ్చే వారందరినీ ఒక్కొక్కరిగా తప్పించేందుకు చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. తన కుమారుడు లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ ను బాలకృష్ణ రాజకీయాలలోకి బలవంతంగా తీసుకు వచ్చినా ఆయనను ఎదగకుండా చేసేందుకు అన్ని శక్తులను ఉపయోగిస్తారంటున్నారు.
విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని దివంగత నేత మనవడు శ్రీ భరత్ తొలి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆయన రాకను ఇష్టపడని చంద్రబాబునాయుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా చివరి వరకు నానుస్తూ వచ్చారు.
చివరకు వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ రంగంలోకి దిగి తన రెండో అల్లుడు అయిన శ్రీ భరత్ కు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేది లేక విశాఖ లోక్ సభ స్థానం నుంచి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. టికెట్ అయితే ఇచ్చారు గాని శ్రీభరత్ ను ఎలా ఓడించాలన్న అనే అంశంలో పథక రచన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్తున్నారు.
ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా శ్రీ భరత్ ను ఓడించేందుకు సి.బి.ఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణను రంగంలోకి దించారట చంద్రబాబు నాయుడు. జనసేన అభ్యర్థిగా లక్ష్మీనారాయణను విశాఖ లోక్ సభ బరిలోకి దిగేలా చేసి శ్రీ భరత్ ఓటమికి పునాదులు వేయడం ప్రారంభించారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జనసేన నుంచి పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణకు పార్లమెంట్ లోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెలుగుదేశం కార్యకర్తలు లోపాయికారిగా పని చేయాలని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఓట్లు చీలి నారాయణ విజయం సాధించకపోయినా… ఇటు తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భారత్ కూడా పరాజయం పాలు కాక తప్పదన్నది చంద్రబాబు నాయుడి వ్యూహంగా చెబుతున్నారు.
శ్రీ భరత్ ను ఓడించడం ద్వారా భవిష్యత్తులో తన కుమారుడు లోకేష్ కు ఎటువంటి కుటుంబ పరమైన ఇబ్బందులు రాకుండా చేయాలని చంద్రబాబు నాయుడు ఉద్దేశ్యంగా ఉందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.
ఇదే నిజమైతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తలు కూడా ఉండే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.