బాబుతో పొత్తా మజాకా? టీకాంగ్రెస్ కు షాక్‌ల మీద షాక్ !
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది. చంద్రబాబుతో దోస్తీ చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయి. పొత్తులు పెట్టుకున్న పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుంది? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఓమాట అడిగితే ఇప్పుడు మీకు రెండు పార్టుల సినిమా కథ చెబుతారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తర్వాతే తమకు ఏలిన నాటి శని పట్టుకుందని ఇప్పుడు ప్రైవేటు డిస్కషన్‌లో వాపోతున్నారు. ఏ ముహూర్తాన చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందో తెలియదు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీకి […]
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఏం జరుగుతుంది. చంద్రబాబుతో దోస్తీ చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయి. పొత్తులు పెట్టుకున్న పార్టీల భవిష్యత్ ఎలా ఉంటుంది? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఓమాట అడిగితే ఇప్పుడు మీకు రెండు పార్టుల సినిమా కథ చెబుతారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తర్వాతే తమకు ఏలిన నాటి శని పట్టుకుందని ఇప్పుడు ప్రైవేటు డిస్కషన్‌లో వాపోతున్నారు.
ఏ ముహూర్తాన చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందో తెలియదు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అప్పటివరకూ కనీసం 30 నుంచి 40 సీట్లు గెలుస్తారన్న ఆశ కాంగ్రెస్ నేతల్లో ఉండేది. కానీ పొత్తుతో సగం సీట్లకు పడిపోయారు. ఆ తర్వాత ఒక్కో ఎమ్మెల్యే….ఒక్కో నేత జారుకోవడం మొదలుపెట్టారు. ఎంపీ ఎన్నికలు… ఆ తర్వాత వచ్చే మండలపరిషత్ ఎన్నికల లోపు మిగతా నేతలు కూడా జారుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్‌ను ఎలా ముంచింది? అనే డౌట్‌ను ఓ కాంగ్రెస్ నేత చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆతర్వాత 2004లో కలిసి పోటీ చేశారు. కానీ ఆ తర్వాత బీజేపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. 2014లో మోదీ వచ్చే వరకు లేవకుండా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇప్పుడు లేచే సత్తా లేకుండా ఉండిపోయింది. బాబుతో పొత్తు వల్లే బీజేపీ ఏపీ, తెలంగాణలో ఆ పార్టీ పుంజుకోలేకపోతుందని ఆయన అన్నారు.
2009లో వామపక్షాలతో చంద్రబాబు కలిశారు. కానీ ఏమైంది… ఇప్పుడు ఆ పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయి. ఒకటి, రెండు సీట్లలో గెలిచేందుకు పొత్తుల కోసం వెతుకుతున్నాయి. ఆ సీట్లు కూడా గెలుస్తామనే గ్యారెంటీ లేకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా అలా తయారైంది. ఏ పార్టీతోనైనా చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటే…. ఆ పార్టీలో కీలక నేతలను లొంగదీసుకుని… ఆ పార్టీని ఎదగకుండా చేయడమే చంద్రబాబు ప్లాన్ అని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎప్పుడు గుర్తిస్తారోనని వాపోతున్నారు.