ఆదిలోనే దెబ్బతిన్న ఎర్రసైన్యం!
జనసేనతో ఆరంభం నుంచీ వామపక్షాలు ఆందోళనగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలతో ఏకీభవించలేక, వ్యతిరేకించలేక సతమతం అవుతున్నాయి. అయినా సరే ఎన్నికల వేళ అన్నింటినీ సర్దుకుని ఓపిక పడుతున్నాయి. సీట్ల విషయంలోనూ ఎర్రసైన్యానికి పవన్ తీవ్ర నష్టమే చేశారు. రాష్ర్టంలో సిపిఎం నాలుగు పార్లమెంటు స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు ఆశించింది. అదే స్థాయిలో సిపిఐ కూడా కోరింది. కానీ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాయి […]
జనసేనతో ఆరంభం నుంచీ వామపక్షాలు ఆందోళనగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలతో ఏకీభవించలేక, వ్యతిరేకించలేక సతమతం అవుతున్నాయి. అయినా సరే ఎన్నికల వేళ అన్నింటినీ సర్దుకుని ఓపిక పడుతున్నాయి.
సీట్ల విషయంలోనూ ఎర్రసైన్యానికి పవన్ తీవ్ర నష్టమే చేశారు. రాష్ర్టంలో సిపిఎం నాలుగు పార్లమెంటు స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు ఆశించింది. అదే స్థాయిలో సిపిఐ కూడా కోరింది. కానీ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాయి వామపక్షాలు.
తప్పని పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దీనికి తోడు కోరిన స్థానాలను కూడా జనసేన ఇవ్వకపోవడంతో కూడా ఆగ్రహం తో ఉన్నాయి. ఆఖరు నిమిషంలో జనసేనతో పొత్తును వదులుకుంటే పరిస్థితులు ఎటు దారితీస్తాయో అనే భయం వామపక్షాలను వెన్నాడుతోంది.
బీఎస్పీ కోరిన సీట్లకంటే ఎక్కువ ఇచ్చారు. వామపక్షాలకు మాత్రం కోరిన వాటిల్లో కోతపెట్టారు. బీఎస్పీ అవసరం జనసేనకు ఉంది, జసనేన అవసరం వామపక్షాలకు ఉంది అని వామపక్షాల నేత ఒకరు పేర్కొన్నారు.
మరో వైపు తెలుగుదేశం పార్టీతో జనసేన తెరవెనుక మైత్రీ బంధం పైన కూడా సిపిఎం తీవ్రంగా కలత చెందుతోంది. సిపిఐ మాత్రం కొంత సానుకూలంగానే ఉంది. ముందుగానే ఈవిషయం తెలిస్తే మాదారి మేము చూసుకునే వాళ్లం…. కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు సలహాతో జనసేన ఊహించని నిర్ణయాలు తీసుకుంటోంది.
ఏమీ చేయలేని పరిస్థితి మాది అని వామపక్షాల నేత ఒకరు పేర్కొన్నారు. జనసేన వల్ల వామపక్షాల విశ్వసనీయతపై మాయని మచ్చ పడే అవకాశం లేకపోలేదని వాళ్ళు పేర్కొంటున్నారు.