Telugu Global
National

నీరవ్ మోదీ వస్తున్నాడు....

నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 10 వేల కోట్లకు ముంచిన వజ్రాల వ్యాపారి. నీరవ్ మోదీ ఎట్టకేలకు భారత్ కు రానున్నారు. ఆర్దిక నేరగాడుగా పరిగణించిన నీరవ్ మోదీ దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను భారత్ కు అప్పగించాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి), విదేశాంగ శాఖ…. లండన్ ప్రభుత్వాన్ని కోరింది. చాలాకాలంగా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల అనంతరం నీరవ్ మోదీని భారత్ కు పంపించేందుకు యూకె […]

నీరవ్ మోదీ వస్తున్నాడు....
X

నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 10 వేల కోట్లకు ముంచిన వజ్రాల వ్యాపారి. నీరవ్ మోదీ ఎట్టకేలకు భారత్ కు రానున్నారు. ఆర్దిక నేరగాడుగా పరిగణించిన నీరవ్ మోదీ దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

ఆయనను భారత్ కు అప్పగించాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి), విదేశాంగ శాఖ…. లండన్ ప్రభుత్వాన్ని కోరింది. చాలాకాలంగా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల అనంతరం నీరవ్ మోదీని భారత్ కు పంపించేందుకు యూకె ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో భాగంగా లండన్ హైకోర్టు నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంటు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారెంటుతో నాలుగైదు రోజులలో నీరవ్ మోదీని అరెస్టు చేసే అవకాశం ఉంది.

నీరవ్ మోదీ అరెస్ట అనంతరం లండన్ లో చట్టపరమైన కొన్ని లాంఛనాలను పూర్తి చేసి భారత్ కు పంపే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రక్రియకు కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది.

ఇక ఈ మధ్య కాలంలో నీరవ్ మోదీ లండన్ వీధులలో తిరుగుతూ స్దానిక టివి ఛానల్ విలేఖరి కంట పడ్డారు. తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే జర్కిన్ ధరించిన నీరవ్ మోదీ చాలా ఉల్లాసంగా లండన్ వీధులలో తిరుగుతున్నారు. స్థానిక జర్నలిస్ట్ ఎన్ని ప్రశ్నలు వేసినా నీరవ్ మోదీ “నో కామెంట్” అని సమాధానం ఇచ్చారు.

లండన్ లో ఆయన వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారని, ఆయనకు గోల్డ్ కార్డ్ పాస్ పోర్ట్ ఉందని ఈ ఇంటర్వు సందర్భంగా బయటపడింది. గడచిన కొద్ది సంవత్సరాలుగా భారతీయులు ఎదురు చూస్తున్న నీరవ్ మోదీ రాక వాస్తవ రూపం దాల్చేందుకు ఇక కొద్ది రోజులే మిగిలింది.

First Published:  19 March 2019 3:10 AM IST
Next Story