పొంగులేటికి కేసీఆర్ చెక్.... ఖమ్మం అభ్యర్థిగా నామా?
ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు సోమవారం కేసీఆర్‌ను కలిశారు. తనకు ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కల్పించమని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కూడా లోక్‌సభ అభ్యర్థుల ఆశావాహుల జాబితాలో ఆయనను చేర్చినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైసీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. […]
ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు సోమవారం కేసీఆర్‌ను కలిశారు. తనకు ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కల్పించమని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కూడా లోక్‌సభ అభ్యర్థుల ఆశావాహుల జాబితాలో ఆయనను చేర్చినట్లు సమాచారం.
కాగా, ప్రస్తుతం ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైసీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పెద్దదిక్కుగా మారారు. అప్పట్లో తుమ్మల, పొంగులేటి కలిసి పని చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీలో నామా, కేసీఆర్ కలిసే పని చేశారు. నామా ఆర్థికంగా కూడా బలమైన వాడే. అంతే కాకుండా ఖమ్మంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కులానికి ప్రతినిధిగా నామా ఉన్నారు. దీంతో నామా వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం లోపు నామా అభ్యర్థిత్వంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.