Telugu Global
Cinema & Entertainment

పెళ్లి లైఫ్ బోరింగ్ అంటున్న నాగ చైతన్య

‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలలో కలిసి నటించిన నాగచైతన్య, సమంత…. పెళ్లయిన తర్వాత కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘మజిలీ’. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అక్కినేని దంపతులు. తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత, నాగచైతన్య ఒకరిపై మరొకరి అభిప్రాయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందని అడగగా నాగచైతన్య చాలా బోరింగ్ […]

పెళ్లి లైఫ్ బోరింగ్ అంటున్న నాగ చైతన్య
X

‘ఏ మాయ చేసావే’, ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలలో కలిసి నటించిన నాగచైతన్య, సమంత…. పెళ్లయిన తర్వాత కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘మజిలీ’. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అక్కినేని దంపతులు.

తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత, నాగచైతన్య ఒకరిపై మరొకరి అభిప్రాయాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందని అడగగా నాగచైతన్య చాలా బోరింగ్ గా ఉంది అని చెప్పగా…. సమంత మాత్రం అదేం లేదు అన్నట్టు ఎక్స్ ప్రెషన్ పెట్టింది.

ఇక పెళ్లికి ముందు నటించాం…. కానీ పెళ్లి తర్వాత మళ్ళీ ప్రేమలో పడినట్లు నటిస్తే నమ్ముతారా? అని అన్నాడు చైతన్య. సమంత పొసెసివ్ గా ఉంటుందా అని అన్న ప్రశ్నకు నాగచైతన్య అవును అని ఆన్సర్ ఇవ్వగా సమంత ఒప్పుకుంటాను కానీ…. ఈ మధ్యకాలంలో చాలా తగ్గించుకున్నానని చెప్పుకొచ్చింది.

ఈ ప్రోమో వీడియో చూస్తేనే వీరిద్దరితో చేసిన ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా సాగిపోతుందని అర్థమైపోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానుంది.

First Published:  19 March 2019 8:40 AM IST
Next Story