టీడీపీకి హైకోర్టులో షాక్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ కొట్టివేసిన టీఎస్ హైకోర్టు.లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని ’..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు ..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. #LakshmiNTR — Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019 సినిమాలను అడ్డుకోవడం అంటే […]
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ కొట్టివేసిన టీఎస్ హైకోర్టు.
లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపాలని ’..ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు ..పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. #LakshmiNTR— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019
సినిమాలను అడ్డుకోవడం అంటే భావప్రకటన స్వేచ్చను హరించడమేనని కోర్టు అభిప్రాయపడింది. సినిమాను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష్మీస్ వీరగ్రంధం సినిమా విడుదలకు కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఈనెల 29న సినిమా విడుదల చేస్తామని దర్శకుడు వర్మ ప్రకటించారు.
లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపటం కుదరదు..భావ స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమన్న న్యాయస్థానం ..లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని తెలిపిన అడ్వకేట్ జనరల్ ..దీంతో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చిన న్యాయ స్థానం* #LakshmisNTR
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2019