పనిచేయని జేసీ బెదిరింపులు
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులు పనిచేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చితేనే తన కుటుంబం లోక్‌సభ బరిలో దిగుతుందని జేసీ చెబుతూ వచ్చారు. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సిందేనన్నారు. ముఖ్యంగా అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి, గుంతకల్లులో జితేంద్రగౌడ్‌కు టికెట్లు ఇవ్వకూడదని పట్టుబడ్డారు. కానీ శింగనమలలో దళిత మహిళ యామిని బాలకు టికెట్ రాకుండా చేయడంలో మాత్రమే జేసీ విజయం సాధించారు. కల్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరి పట్ల చంద్రబాబు ముందు నుంచే విముఖంగా ఉన్నారు. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో చౌదరి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. జేసీతో వైరం […]
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులు పనిచేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చితేనే తన కుటుంబం లోక్‌సభ బరిలో దిగుతుందని జేసీ చెబుతూ వచ్చారు. నాలుగు స్థానాల్లో అభ్యర్థులను మార్చాల్సిందేనన్నారు.
ముఖ్యంగా అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి, గుంతకల్లులో జితేంద్రగౌడ్‌కు టికెట్లు ఇవ్వకూడదని పట్టుబడ్డారు. కానీ శింగనమలలో దళిత మహిళ యామిని బాలకు టికెట్ రాకుండా చేయడంలో మాత్రమే జేసీ విజయం సాధించారు.
కల్యాణదుర్గంలో హనుమంతరాయచౌదరి పట్ల చంద్రబాబు ముందు నుంచే విముఖంగా ఉన్నారు. ఆయనకు
టికెట్ ఇవ్వలేదు. దాంతో చౌదరి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.
జేసీతో వైరం ఉన్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తిరిగి అనంతపురం టికెట్ సాధించి తనదే పైచేయి అనిపించుకున్నారు. గుంతకల్లు టికెట్ తనను నమ్ముకుని పార్టీలోకి వచ్చిన మధుసూదనగుప్తాకు ఇప్పించుకునేందుకు జేసీ ప్రయత్నించినా… సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కే చంద్రబాబు టికెట్ కేటాయించారు.
దాంతో జేసీ నెగ్గింది … శింగనమలలో దళిత మహిళ యామిని బాలపై మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ తన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రకటించిన నేపథ్యంలో జేసీ ఎటూ వెళ్లలేరన్న ధీమాతోనే చంద్రబాబు జేసీ మాటలను లెక్కచేయలేదన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. అయితే ప్రస్తుతం సర్దుకుపోవడం తప్ప జేసీకి మరో దారి లేని పరిస్థితి.