గాలి ఫ్యామిలీలో రచ్చ రచ్చ
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీలో వివాదాలు చల్లారడం లేదు. ముఖ్యంగా గాలి ఫ్యామిలీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గాలి పెద్దకొడుకు భాను ప్రకాష్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని సోదరుడు జగదీష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా నగరి టికెట్ గాలి పెద్దకొడుకు భాను ప్రకాష్‌కు ఇచ్చారు. దీంతో నగరి టీడీపీ టికెట్ విషయంపై గాలి ముద్దు కృష్ణమ నాయుడి కుటుంబంలో పోరు మరింత రగిలింది. భాను కు టికెట్ ఇవ్వడాన్ని గాలి చిన్న కొడుకు […]
![గాలి ఫ్యామిలీలో రచ్చ రచ్చ గాలి ఫ్యామిలీలో రచ్చ రచ్చ](https://www.teluguglobal.com/h-upload/old_images/125187-gali-bhanu-prakash-vs-gali-jagadish.webp)
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీలో వివాదాలు చల్లారడం లేదు. ముఖ్యంగా గాలి ఫ్యామిలీలో విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గాలి పెద్దకొడుకు భాను ప్రకాష్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని సోదరుడు జగదీష్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే తాజాగా నగరి టికెట్ గాలి పెద్దకొడుకు భాను ప్రకాష్‌కు ఇచ్చారు. దీంతో నగరి టీడీపీ టికెట్ విషయంపై గాలి
ముద్దు కృష్ణమ నాయుడి కుటుంబంలో పోరు మరింత రగిలింది. భాను కు టికెట్ ఇవ్వడాన్ని గాలి చిన్న కొడుకు జగదీష్, గాలి భార్య ఎమ్మెల్సీ సరస్వతమ్మ వ్యతిరేకిస్తున్నారు. భానుప్రకాష్‌కు ఎన్నికల్లో సహకరించేది లేదని చిన్న కొడుకు గాలి జగదీష్ తెగేసి చెప్పారు. నగరి టికెట్ పై సీఎం చంద్రబాబు ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు, .
టికెట్ కోసం తాను ఎవరి కాళ్ళూ పట్టుకోలేదని జగదీష్ విమర్శించారు. తాను లాబీయింగ్ చేయకపోవడంతోనే టికెట్టు రాలేదని చెప్పారు. ఎన్నికల్లో ఓటు హక్కు మాత్రమే వినియోగించకుంటానని అన్నారాయన. పోటీలో ఉన్న భాను ప్రకాష్ తరపున తాను ప్రచారం చేయనని చెప్పారు. ఎన్నికలకు అమ్మ కూడా దూరంగా ఉంటుందని అన్నారాయన. భాను ప్రకాష్‌కు తాము ఓటు వేసేది లేదని తేల్చిచెప్పారు.
వారసుడెవరో ప్రజలే తేలుస్తారని చెప్పుకొచ్చారు. నగరి టికెట్ విషయంలో పార్టీ కేడర్ లో చాలా అసంతృప్తి ఉందని….
కొందరు స్వార్థ పరులే భాను వెంట ఉన్నారని గాలి జగదీష్ అన్నారు. గాలి కుటుంబంలో ఈ విభేదాలు నగరి టీడీపీలో ఎటూ దారితీస్తాయో అనే చర్చ నడుస్తోంది.