ముందే నామినేషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్యే
అనంతపురం జిల్లా టీడీపీలో రచ్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని జేసీ పట్టుపట్టిన నేపథ్యంలో చాలా స్థానాలను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. ఇదే సమయంలో కల్యాణ దుర్గం టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నామినేషన్ వేశారు. ఆయన్ను చంద్రబాబు ఇంకా అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ టిక్కెట్ కోసం ఎదురుచూసిన హనుమంతరాయచౌదరి… తనకు కాకుండా ఒక పారిశ్రామికవేత్తకు చంద్రబాబు టికెట్ కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న హనుమంతరాయ చౌదరి నామినేషన్ వేశారు. టిక్కెట్ ప్రకటించకముందే నామినేషన్ వేయడంపై టీడీపీలోని మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. […]
అనంతపురం జిల్లా టీడీపీలో రచ్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని జేసీ పట్టుపట్టిన నేపథ్యంలో చాలా స్థానాలను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. ఇదే సమయంలో కల్యాణ దుర్గం టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి నామినేషన్ వేశారు.
ఆయన్ను చంద్రబాబు ఇంకా అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ టిక్కెట్ కోసం ఎదురుచూసిన హనుమంతరాయచౌదరి… తనకు కాకుండా ఒక పారిశ్రామికవేత్తకు చంద్రబాబు టికెట్ కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న హనుమంతరాయ చౌదరి నామినేషన్ వేశారు.
టిక్కెట్ ప్రకటించకముందే నామినేషన్ వేయడంపై టీడీపీలోని మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే నామినేషన్ వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని హనుమంతరాయ చౌదరి స్పష్టం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీకి సిద్దమని ప్రకటించారు.