Telugu Global
NEWS

నర్సీపట్నం నుంచి జగన్ ఎన్నికల శంఖారావం!

ఎంతో సమయం లేదు. ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తులకు, వ్యూహాలకు ఒకవైపు చెక్ పెడుతూనే మరోవైపు భారీ ప్రచారానికి తెర తీస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. ఆదివారం నాడు ఇడుపులపాయలో తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించి రాష్ట్ర్రంలోని 175 శాసనసభ నియోజక వర్గాలకు, మిగిలిన 16 లోక్ సభ […]

నర్సీపట్నం నుంచి జగన్ ఎన్నికల శంఖారావం!
X

ఎంతో సమయం లేదు. ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తులకు, వ్యూహాలకు ఒకవైపు చెక్ పెడుతూనే మరోవైపు భారీ ప్రచారానికి తెర తీస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

ఆదివారం నాడు ఇడుపులపాయలో తన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించి రాష్ట్ర్రంలోని 175 శాసనసభ నియోజక వర్గాలకు, మిగిలిన 16 లోక్ సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు జగన్ మోహన్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు.

విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నుంచి తన ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల తో పాటు మరో మండల కేంద్రంలో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.

కేవలం 22 రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా జగన్ పర్యటన రూపుదిద్దుతున్నారు పార్టీ శ్రేణులు. రోజుకు మూడు నుంచి ఐదు బహిరంగసభలలో పాల్గొనాలని, వీలైనంత ఎక్కువ మంది ప్రజలను నేరుగా కలుసుకోవాలనే విధంగా ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని కూడా అడ్డుకునేందుకు కొత్త కొత్త వ్యూహాలను, అడ్డంకులను తీసుకువస్తుందని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు ముందుండాలని జగన్ పిలుపునిస్తున్నారు.

రానున్న 20 రోజులు పార్టీ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు తమ సొంత వ్యవహారాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

First Published:  17 March 2019 2:08 AM IST
Next Story