రవీంద్రబాబుకు బహిరంగసభలో జగన్ హామీ
టీడీపీ తరపున 2014లో అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన పండుల రవీంద్ర బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఉదయం నుంచి రవీంద్ర బాబుకు జగన్ హ్యాండ్ ఇచ్చారని… రవీంద్ర బాబు ఆవేదనతో ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. ఆయన తిరిగి టీడీపీలోకి వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వాటికి జగన్ చెక్ పెట్టారు. పి. గన్నవరంలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో రవీంద్ర బాబు కూడా పాల్గొన్నారు. […]
టీడీపీ తరపున 2014లో అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన పండుల రవీంద్ర బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఉదయం నుంచి రవీంద్ర బాబుకు జగన్ హ్యాండ్ ఇచ్చారని… రవీంద్ర బాబు
ఆవేదనతో ఉన్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. ఆయన తిరిగి టీడీపీలోకి వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే వాటికి జగన్ చెక్ పెట్టారు. పి. గన్నవరంలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో రవీంద్ర బాబు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రసంగం ఆఖరిలో రవీంద్ర బాబు గురించి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రవీంద్రబాబు ఎంపీ పదవిని కూడా వదులుకుని పార్టీలోకి వచ్చారని… ఆయన్ను తన గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు.
పార్టీ అధికారంలోకి రాగానే జిల్లా నుంచి మొట్ట మొదటి ఎమ్మెల్సీగా పండుల రవీంద్రబాబును చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో పండుల రవీంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.