టీడీపీ వయా జనసేన..... మాజీ జేడీ లక్ష్మీనారాయణ !
హెడ్ ఆఫీసులో పోస్టు లేకపోతే బ్రాంచ్ ఆఫీసులో కొందరు తేలుతారు. ఇప్పుడు అలాగే ఉంది మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి. టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఆ పార్టీ అనుకుల మీడియాలో లీకులు ఇచ్చారు. కానీ ప్రజల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్ లు ఒక లెవల్లో మండిపడ్డారు. లక్ష్మీనారాయణ, టీడీపీ బంధం తేటతెల్లమైంది. జగన్‌పై కేసుల విచారణ కక్షతోనే చేశారని… పస లేని కేసులు పట్టుకుని లక్ష్మీనారాయణ కథ నడిపించారనే విమర్శలు వెల్లువడ్డాయి. నెటిజన్ […]
హెడ్ ఆఫీసులో పోస్టు లేకపోతే బ్రాంచ్ ఆఫీసులో కొందరు తేలుతారు. ఇప్పుడు అలాగే ఉంది మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి. టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఆ పార్టీ అనుకుల మీడియాలో లీకులు ఇచ్చారు.
కానీ ప్రజల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్ లు ఒక లెవల్లో మండిపడ్డారు. లక్ష్మీనారాయణ, టీడీపీ బంధం తేటతెల్లమైంది. జగన్‌పై కేసుల విచారణ కక్షతోనే చేశారని… పస లేని కేసులు పట్టుకుని లక్ష్మీనారాయణ కథ నడిపించారనే విమర్శలు వెల్లువడ్డాయి.
నెటిజన్ లు, జనం రెస్పాన్స్‌తో టీడీపీలో లక్ష్మీనారాయణ చేరిక వాయిదా పడింది. దీంతో ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా రాజకీయాలు నడుపుతున్న జనసేన వైపు ఆయన చూపు పడింది. పవన్ కల్యాణ్‌ను అర్ధరాత్రి కలుసుకుని జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.
లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీ సీటు లేదా భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందు కోసమే ఈ రెండు సీట్లను టీడీపీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. జేడీ సీటు పక్కా అయితే అక్కడ టీడీపీ డమ్మీ క్యాండేట్‌ను నిలబెడుతుందని సమాచారం.
మొత్తానికి టీడీపీ వయా జనసేనలోకి లక్ష్మీనారాయణ చేరిపోయారు. ఆయన అసలు రంగును బయటపెట్టుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.