Telugu Global
National

గోవా సీఎం పారికర్ కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(63) కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సీఎంవో ట్విట్టర్‌లో పేర్కొన్న కాసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆయనకు గోవాలోనే వైద్యులు చికిత్స చేస్తున్నా ఆయన శరీరం సహకరించలేదు. రెండేళ్ల క్రితమే పారికర్‌కు క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోని ఎయిమ్స్, […]

గోవా సీఎం పారికర్ కన్నుమూత
X

బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(63) కాసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సీఎంవో ట్విట్టర్‌లో పేర్కొన్న కాసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆయనకు గోవాలోనే వైద్యులు చికిత్స చేస్తున్నా ఆయన శరీరం సహకరించలేదు.

రెండేళ్ల క్రితమే పారికర్‌కు క్యాన్సర్ సోకినట్లు తెలియడంతో అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలోని ఎయిమ్స్, ముంబైలోని లీలావతి ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేశారు. అయినా ఆయనకు పూర్తి స్థాయిలో నయం కాకపోవడం.. గత నెల నుంచి తిరిగి వ్యాది తిరగబెట్టడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చివరకు ఆయన ఆదివారం సాయంత్రం 7.30 తర్వాత మరణించారు.

ఇక తొలి సారిగా 1994లో గోవా శాసన సభకు ఎన్నికైన పారికర్.. 2000లో గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2002లో తను గోవా సీఎంగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మైనార్టీ ప్రభుత్వాన్నే పారికర్ అత్యంత చాకచక్యంగా నడిపించారు. మోడీ హయాంలో రక్షణ మంత్రిగా బాధ్యలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు కుమారులు.

పలువురి సంతాపం :

గోవా సీఎం చనిపోయిన విషయం తెలుసుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ సంతాపాన్ని ప్రకటించారు.

First Published:  17 March 2019 4:09 PM IST
Next Story