Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ హీరోకు పాతిక కోట్ల బిజినెస్

వరుసగా అరడజను ఫ్లాపులు. మరో హీరో అయితే ఈపాటికి పెట్టీబెడా సర్దుకొని ఇంటికెళ్లిపోతాడు. కానీ అక్కడున్నది సాయిధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ మనిషి. అందుకే ఆరు ఫ్లాపులొచ్చినా చెక్కుచెదరలేదు. అంతేకాదు.. నెక్ట్స్ సినిమాకు ఏకంగా పాతిక కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేశాడు. అవును.. తేజూ నటిస్తున్న చిత్రలహరి సినిమాకు అక్షరాలా 25 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్, డబ్బింగ్, ఆడియో, ఓవర్సీస్ మొత్తం కలుపుకొని […]

ఫ్లాప్ హీరోకు పాతిక కోట్ల బిజినెస్
X

వరుసగా అరడజను ఫ్లాపులు. మరో హీరో అయితే ఈపాటికి పెట్టీబెడా సర్దుకొని ఇంటికెళ్లిపోతాడు. కానీ అక్కడున్నది సాయిధరమ్ తేజ్. మెగా కాంపౌండ్ మనిషి. అందుకే ఆరు ఫ్లాపులొచ్చినా చెక్కుచెదరలేదు. అంతేకాదు.. నెక్ట్స్ సినిమాకు ఏకంగా పాతిక కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేశాడు. అవును.. తేజూ నటిస్తున్న చిత్రలహరి సినిమాకు అక్షరాలా 25 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది

ఆంధ్రా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్, డబ్బింగ్, ఆడియో, ఓవర్సీస్ మొత్తం కలుపుకొని ఈ సినిమా పాతిక కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఎంత రేటుకు అమ్మితే బాగుంటుందో మీరే చెప్పండంటూ నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్లకే వదిలేశారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. వాళ్లంతా చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని, ఓ రేటు ఫిక్స్ చేసి చెప్పారు. అదే రేటుకు రైట్స్ ఇచ్చేశారు. అలా అటు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందిపడకుండా, ఇటు నిర్మాతలు ఆశపడకుండా మధ్యేమార్గంగా బిజినెస్ పూర్తిచేశారు.

కానీ ఇక్కడ చిన్న మెలిక ఉంది. సినిమాకు ఎంత ఖర్చయిందే, ప్రీ-రిలీజ్ కూడా అంతే అయింది. అంటే నిర్మాతలకు మిగిలింది ఏమీ లేదన్నమాట. తిరిగి ప్రచారం ఖర్చు ఒకటి అదనం. కాబట్టి ఈ సినిమా హిట్ అయి బ్రేక్-ఈవెన్ అయితేనే నిర్మాతలకు ఏమైనా మిగులుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలు, హీరో, బయ్యర్లు…. ఇలా అంతా మునిగిపోవడం ఖాయం.

First Published:  17 March 2019 2:16 AM IST
Next Story