లక్ష్మీస్ ఎన్టీఆర్కు షాక్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించలేదు. ఏపీలో పోలింగ్ ముగిసే వరకు ఆగాల్సిందిగా సూచించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ప్రధానంగా చూపిస్తున్నారు. సినిమా విడుదలైతే చంద్రబాబుకు ఇబ్బంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు…. ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందిగా సెన్సార్ బోర్డు సూచించింది. అయితే సెన్సార్ బోర్డు తీరుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు తీరు సరిగా లేదన్నారు. ఏప్రిల్ 11 వరకు సినిమా […]
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అంగీకరించలేదు. ఏపీలో పోలింగ్ ముగిసే వరకు ఆగాల్సిందిగా సూచించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ప్రధానంగా చూపిస్తున్నారు.
సినిమా విడుదలైతే చంద్రబాబుకు ఇబ్బంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు…. ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందిగా సెన్సార్ బోర్డు సూచించింది.
అయితే సెన్సార్ బోర్డు తీరుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు తీరు సరిగా లేదన్నారు. ఏప్రిల్ 11 వరకు సినిమా విడుదల కోసం ఆగాలన్న సెన్సార్ సూచనను కోర్టులో సవాల్ చేస్తానని వర్మ చెప్పారు. చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయంలో…. వర్మ అయినా కోర్టులో గెలుస్తారేమో చూడాలి.
I AM FILING A CASE ON THE CENSOR BOARD FOR ILLEGALLY TRYING TO STOP LAKSHMI’S NTR Read the details at https://t.co/nKcycB7gtg pic.twitter.com/vKIw43mVPN
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2019