మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణకు.... ఈ పరీక్షలు తప్పనిసరి
గత కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకుమునుపు మహిళల ఆరోగ్యం అనగానే కేవలం ప్రసూతి ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే చికిత్స ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి వివిధ విభాగాల వారిగా చికిత్స చేసే సంప్రదాయం ప్రారంభమైంది. భారతీయ మహిళ జీవన ప్రమాణం పెరిగింది. ప్రస్తుతం మహిళల్లో సగటు జీవన ప్రమాణం 70 ఏళ్లుగా ఉంది. మహిళల్లో సంభవిస్తున్న మరణాల్లో గుండె సంబంధిత మరణాలు ఎక్కువ అని చెప్పొచ్చు. దీంతో […]
గత కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంతకుమునుపు మహిళల ఆరోగ్యం అనగానే కేవలం ప్రసూతి ఆరోగ్యానికి సంబంధించి మాత్రమే చికిత్స ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి వివిధ విభాగాల వారిగా చికిత్స చేసే సంప్రదాయం ప్రారంభమైంది.
భారతీయ మహిళ జీవన ప్రమాణం పెరిగింది. ప్రస్తుతం మహిళల్లో సగటు జీవన ప్రమాణం 70 ఏళ్లుగా ఉంది. మహిళల్లో సంభవిస్తున్న మరణాల్లో గుండె సంబంధిత మరణాలు ఎక్కువ అని చెప్పొచ్చు. దీంతో పాటు మనం ఇప్పుడు చూస్తున్న మరణాల సంఖ్య పెరగడానికి క్యాన్సర్ ప్రధాన కారణంగా నిలుస్తోంది.
మహిళలు అన్ని రకాల క్యాన్సర్ ల బారిన పడుతున్నారు. వీటిలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ అనేవి సర్వ సాధారణం. భారతీయ మహిళల్లో మాత్రం రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పీడితుల సంఖ్య బాగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గర్భాశయ క్యాన్సర్ అతి సాధారణ విషయంగా మారింది. గ్లోబోకాన్ 2018 తెలియజేసిన వివరాల ప్రకారం ప్రతీ సంవత్సరం లక్షా 62వేల 468 మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. దాదాపు 87వేల పై చిలుకు మంది క్యాన్సర్ బారినపడి చనిపోతున్నారు.
మనం గనక ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. రొమ్ము క్యాన్సర్ ఉన్న ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ చనిపోతుంది. అదే అమెరికాలాంటి దేశంలో ఆరుగురు మహిళలకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే కేవలం ఒక మహిళ మాత్రమే చనిపోతుంది. దీనిని బట్టీ మనదేశంలో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు.
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ఒక కారణం ఉంది. మనదేశంలో క్యాన్సర్ రోగులు చివరిదశలో ఉన్నప్పుడు మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. క్యాన్సర్ మీద సరైన అవగాహన లేకపోవడం లేదా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి సరైన కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల మనదేశంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి.
తాజా నియమ నిబంధనల ప్రకారం ప్రతీ మహిళ 50 ఏళ్లు నిండగానే ఒకసారి మెమోగ్రాం పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష కూడా ప్రతీ రెండు సంవత్సరాలకోసారి చేయించుకోవాలి. మహిళలు 40వ వడిలో పడగానే డాక్టర్లను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. మెమోగ్రాఫిక్ స్క్రీనింగ్, బయాప్సీ, లెక్కకు మించి ఆరోగ్య నిర్ధారణ పరీక్షల వల్ల వచ్చే దుష్పరిణామాల మీద ఈ సిఫారసు ఉంటాయి. ఇవి కూడా తాజా శాస్త్రీయ సమాచారం ప్రకారం ఉంటాయి. 50 నుంచి 70 ఏళ్లలోపు ఉన్న మహిళలు మెమోగ్రాఫిక్ పరీక్షలు చేసుకోవాలి. మన దేశంలో గర్భాశయ క్యాన్సర్ అనేది కూడా ప్రధాన ప్రజారోగ్య సమస్య అని చెప్పొచ్చు. సగటున 9వేల పై చిలుకు కేసులు ప్రతీ సంవత్సరం నమోదవుతున్నాయి.