Telugu Global
Cinema & Entertainment

రేపంటే రేపే పెళ్ళికి సిద్ధం.... కానీ....

త్రిష కృష్ణన్.. దక్షిణ భారత చలన చిత్ర రంగం లో ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉండే పేరు ఇది. తన మొదటి చిత్రం నుండి ఇప్పటి దాకా విభిన్న పాత్రలను ఎన్నుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత సంవత్సరం త్రిష కెరీర్ లోనే ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. విజయాలతో పాటు…. అవార్డులు కూడా సాధించింది త్రిష. అంతా సవ్యంగా సాగుతున్న ఈ అమ్మడి జీవితం లో పెళ్ళి ఎప్పుడూ? అని అందరికీ ఆసక్తి […]

రేపంటే రేపే పెళ్ళికి సిద్ధం.... కానీ....
X

త్రిష కృష్ణన్.. దక్షిణ భారత చలన చిత్ర రంగం లో ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉండే పేరు ఇది. తన మొదటి చిత్రం నుండి ఇప్పటి దాకా విభిన్న పాత్రలను ఎన్నుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

గత సంవత్సరం త్రిష కెరీర్ లోనే ఒక స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. విజయాలతో పాటు…. అవార్డులు కూడా సాధించింది త్రిష. అంతా సవ్యంగా సాగుతున్న ఈ అమ్మడి జీవితం లో పెళ్ళి ఎప్పుడూ? అని అందరికీ ఆసక్తి ఉంది.

అయితే ఇదే విషయాన్ని మీడియా ఎప్పటి నుండో త్రిష ని అడుగుతూ వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు త్రిష కరెక్ట్ సమాధానం మాత్రం ఇవ్వడం లేదు.

2015 లో ఒకసారి ఎంగేజ్మెంట్ చేసుకొని…. కొన్ని కారణాల వల్ల ఆ రిలేషన్ లో నుండి బయటకు వచ్చింది త్రిష. అప్పటి నుండి సింగల్ అని చెప్తూ…. వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

ఇప్పుడు తాజాగా ఆమె వివాహం గురించి స్పందిస్తూ…. “రేపంటే రేపే పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను… కానీ నాకు కావాల్సిన సరైన అబ్బాయి మాత్రం ఇంకా దొరకలేదు. అది జరగ్గానే, నేనే నా పెళ్ళి గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేస్తాను” అని చెప్పింది.

First Published:  16 March 2019 8:14 AM IST
Next Story