Telugu Global
NEWS

దక్షిణాదిన పాగాకై కాంగ్రెస్ కన్ను

ఎన్నికల వేళ… ఎత్తులకు పై ఎత్తులు వేసే వేళ… తమ రాజకీయ చతురతను బయటపెట్టాల్సిన వేళ…. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలో కొనసాగాలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పీఠం ఎక్కాలని తమ సర్వశక్తులూ ధారపోసే వేళ…. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన కూడా ఘోరంగా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగురాష్ట్రాలలో మంచి పట్టుందనే చెప్పాలి. కానీ అప్పటి అధిష్టానం తీసుకున్న కొన్ని తొందరపాటు […]

దక్షిణాదిన పాగాకై కాంగ్రెస్ కన్ను
X

ఎన్నికల వేళ… ఎత్తులకు పై ఎత్తులు వేసే వేళ… తమ రాజకీయ చతురతను బయటపెట్టాల్సిన వేళ…. అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలో కొనసాగాలని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పీఠం ఎక్కాలని తమ సర్వశక్తులూ ధారపోసే వేళ…. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన కూడా ఘోరంగా ఓడిపోయింది.

నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగురాష్ట్రాలలో మంచి పట్టుందనే చెప్పాలి. కానీ అప్పటి అధిష్టానం తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల వలన పార్టీకి ఈ గతి పట్టిందని తెలుగు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అయితే ఈ ఐదు సంవత్సరాలలో అమూల్ బాయ్ లా ఉండే రాహుల్ గాంధీ కాస్త రాజకీయం నేర్చుకున్నారనే చెప్పవచ్చు. ఈ నాలుగేళ్లలో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లగలిగారు. అంతే కాదు రాఫెల్ స్కామ్ విషయంలో బిజేపీని ఇరుకున పెట్టగలిగారు.

ఉత్తరాన జరిగిన ఎన్నికలలో పవనాలు తమవైపు వీచేలా విజయం సాధించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్ను దక్షిణ భారతదేశం పై పడింది. ఇందుకోసం కొత్త కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలలో ప్రియాంక గాంధీని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన బలహీనంగా ఉన్న పార్టీ తిరిగి పుంజుకోవాలంటే ప్రియాంక గాంధీని మెదక్ లోక్ సభ స్దానానికి పోటీ చేయిస్తే బాగుటుందని కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీకి చెప్పినట్లు సమాచారం.

అలాగే రాహుల్ గాంధీని తమిళనాడు నుంచి గాని కర్ణాటక నుంచి గాని లోక్ సభ స్థానానికి పోటీ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీకి భారత దేశంలో కాస్తో కూస్తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాట వాస్తవమే కదా…. ఈ అవకాశాన్ని వాడుకుని మెదక్ నుంచి పోటీకి దింపితే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలలో దక్షిణాదిన తమిళనాడు నుంచి గాని, కర్ణాటకా నుంచి గాని రాహుల్ పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీకి గట్టిగా చెప్తున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికలలో దక్షిణాదిన గట్టి పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  16 March 2019 11:14 AM IST
Next Story