భ్రమలు తొలగిస్తున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేస్తానని, మార్పు తీసుకు వస్తానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా ఆ భ్రమలని పోగొడుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి చంద్రబాబు అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులలోను మద్దతు తెలిపేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే గడచిన 15 రోజులుగా […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేస్తానని, మార్పు తీసుకు వస్తానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా ఆ భ్రమలని పోగొడుతున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి చంద్రబాబు అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులలోను మద్దతు తెలిపేది లేదంటూ ప్రకటనలు గుప్పించారు. అయితే గడచిన 15 రోజులుగా పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనలు కాని, ఆయన కొత్త స్నేహాలు కాని పరిశీలించిన వారికి పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రెండు రోజుల క్రితం కేసీఆర్ పై మండిపడ్డ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి అనుకూలించేలా మాట్లాడారు. ఆ ప్రకటనలు విన్న, చదివిన వారికి అవి పవన్ కళ్యాణ్ ప్రకటనలుగా కాకుండా చంద్రబాబు నాయుడి ఆలోచనలుగానే అర్దం అవుతోంది.
ఇక తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయవతితో కలిసి అమరావతిలో కొత్త పొత్తుకు తెర తీసారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కడుతున్న కూటమిలో మాయవతి కీలకం. దీని అర్దం ఆంధ్రప్రదేశ్ లో మాయవతి, పవన్ కల్యాణ్ ల పొత్తు చంద్రబాబు నాయుడి కోసం వేసిన వ్యూహంగానే చెబుతున్నారు.
మాయవతితో పొత్తు అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడికి అనుకూలించేదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రోజుకో విధంగా చంద్రబాబుకు అనుకూలించేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తించడం ఆయనపై ఉన్న భ్రమలను తొలగిస్తోందని చెబుతున్నారు.
అన్నింటికి మించి వైసీపీ ఓటు బ్యాంక్ లో దళితులు కీలకం. ఆ ఓట్లు చీల్చడానికే మాయావతి పార్టీని పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు రప్పించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.