Telugu Global
Cinema & Entertainment

దుబాయ్ వెళ్లనున్న 'మహర్షి' టీమ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా గా వస్తున్న ‘మహర్షి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ లో ఆఖరి షెడ్యూల్ మిగిలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ను […]

దుబాయ్ వెళ్లనున్న మహర్షి టీమ్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా గా వస్తున్న ‘మహర్షి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ లో ఆఖరి షెడ్యూల్ మిగిలిపోయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ఆఖరి షెడ్యూల్ ను పూర్తి చేయడానికి దుబాయ్ వెళ్లనుంది. త్వరలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం దుబాయ్ వెళ్లనుంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తి అయిపోతే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లే.

ఇక షూటింగ్ పూర్తవగానే ప్రమోషన్ల పైన దృష్టి పెట్టనున్నారు దర్శక నిర్మాతలు. దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమా మే 9న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.

దిల్ రాజు, పీవీపీ మరియు అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాతో తన సక్సెస్ ను కొనసాగిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

First Published:  16 March 2019 8:04 AM IST
Next Story