టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా....
నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదు. భూమా అఖిల ప్రియ పేరు మాత్రమే ప్రకటించిన చంద్రబాబు…. బ్రహ్మానంద రెడ్డి, ఎస్వీమోహన్ రెడ్డిలకు మాత్రం టికెట్ ఖాయం చేయలేదు. నంద్యాల టికెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవైరెడ్డి అల్లుడు పోటీ పడుతున్నారు. వారి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులతో బ్రహ్మానందరెడ్డి హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు. రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా […]
నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి అయోమయంలో పడింది. తొలి జాబితాలో ఆయన పేరు లేదు. భూమా అఖిల ప్రియ పేరు మాత్రమే ప్రకటించిన చంద్రబాబు…. బ్రహ్మానంద రెడ్డి, ఎస్వీమోహన్ రెడ్డిలకు మాత్రం టికెట్ ఖాయం చేయలేదు.
నంద్యాల టికెట్ కోసం ఏవీ సుబ్బారెడ్డి, ఎస్పీవైరెడ్డి అల్లుడు పోటీ పడుతున్నారు. వారి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుచరులతో బ్రహ్మానందరెడ్డి హడావుడిగా సమావేశం ఏర్పాటు చేశారు.
రెండో జాబితాలో తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని భూమా బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.
తమ కుటుంబంలో ఎస్వీమోహన్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్
చేశారు. తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే… తమ కుటుంబంలో టికెట్ వచ్చిన వారు కూడా పోటీ చేయరని ప్రకటించారు.