వైసీపీలోకి ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పరిస్థితి టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉందన్న అభిప్రాయం నేపథ్యంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడడం చర్చనీయాంశమైంది. 43కోట్లు బ్యాంకులో జమ అయ్యాక ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వెళ్లారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీలోనే ఉంటానని చెప్పడంతో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చంద్రబాబు మంజూరు చేయించారని… దాంతో 43 […]
నెల్లూరు జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పరిస్థితి టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉందన్న
అభిప్రాయం నేపథ్యంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడడం చర్చనీయాంశమైంది. 43కోట్లు బ్యాంకులో జమ అయ్యాక ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడి వెళ్లారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీలోనే ఉంటానని చెప్పడంతో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చంద్రబాబు మంజూరు చేయించారని… దాంతో 43 కోట్లు ఆదాల అకౌంట్‌లో పడ్డాయని చెబుతున్నారు. డబ్బులు జమ కాగానే ఫోన్ స్విచ్చాప్ చేశారు. 43 కోట్లు పడ్డట్టు మొబైల్‌కు మేసేజ్ రాగానే హఠాత్తుగా ప్రచారం ఆపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కంగారుపడ్డ టీడీపీ నేతలు ఆదాలకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఇంతలో ఆయన అనుచరులు కూడా ఇంటి వద్ద టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడంతో క్లారిటీ వచ్చేసింది.
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరే సమయంలోనే ఆదాల కూడా వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగిందని.. కానీ తాను టీడీపీలోనే ఉంటానని ఆదాల చెప్పడంతో చంద్రబాబు 600 కోట్ల విలువైన సోమశిల హైలెవన్ కెనాల్ పనులు అప్పగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడడం టీడీపీకి మానసికంగా పెద్ద దెబ్బ అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.