Telugu Global
National

వైఎస్ వివేకా హత్యపై సంచలన విషయాలు చెప్పిన జగన్

తన బాబాయి హత్య అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్య అని జగన్ వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం గడిపి, సౌమ్యుడిగా పేరున్నవ్యక్తిని అత్యంత కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి చంపడం మించిన దారుణం మరొకటి ఉండదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎలాంటి వారో అందరికీ తెలుసన్నారు. హత్య జరిగిన తర్వాత దర్యాప్తు చేస్తున్న తీరు  చూస్తుంటే మరింత బాధగా ఉందన్నారు. చనిపోయే ముందు వివేకానంద రెడ్డి ఒక డ్రైవర్ పేరు రాసి ఒక లేఖ రాశారని పోలీసులు తనకు చూపించారన్నారు. తల […]

వైఎస్ వివేకా హత్యపై సంచలన విషయాలు చెప్పిన జగన్
X

తన బాబాయి హత్య అత్యంత దారుణమైన, రాజకీయంగా నీచమైన చర్య అని జగన్ వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం గడిపి, సౌమ్యుడిగా పేరున్నవ్యక్తిని అత్యంత కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలితో నరికి చంపడం మించిన దారుణం మరొకటి ఉండదన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి ఎలాంటి వారో అందరికీ తెలుసన్నారు. హత్య జరిగిన తర్వాత దర్యాప్తు చేస్తున్న తీరు
చూస్తుంటే మరింత బాధగా ఉందన్నారు. చనిపోయే ముందు వివేకానంద రెడ్డి ఒక డ్రైవర్ పేరు రాసి ఒక లేఖ రాశారని పోలీసులు తనకు చూపించారన్నారు. తల మీద గొడ్డలితో ఐదు సార్లు నరికారని… అయితే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు
బెడ్ రూం నుంచి తీసుకెళ్లి బాత్‌రూంలో వేశారన్నారు.

ఈ హత్యలో ఒకరు కాదు పలువురు పాల్గొన్నారని జగన్ చెప్పారు. మూర్చ వచ్చి కిందపడిపోయి చనిపోయినట్టుగా చిత్రీకరించేందుకు కుట్ర చేశారన్నారు. గొడ్డలితో నరికిన తర్వాత, అంత రక్తం వచ్చిన తర్వాత…. ఆయన లేఖ ఎలా రాసి ఉంటారని జగన్ ప్రశ్నించారు. దీన్ని బట్టే పోలీసులు చూపుతున్న లేఖ కల్పితమని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

కేసును మొత్తం తప్పుదారి పట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని జగన్ చెప్పారు. తాను ఎస్పీతో మాట్లాడుతున్న సమయంలో మూడు సార్లు ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు వరుసగా ఫోన్లు చేశారని జగన్ చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన తాత రాజారెడ్డిని ఇదే తరహాలో హత్య చేశారన్నారు. వైఎస్ మరణంపైనా తమకు అనుమానం ఉందన్నారు. వైఎస్ మరణంపైనా విచారణ చేసింది కూడా సీబీఐ జేడీ లక్ష్మీనారాయణేనన్నారు. తిరిగి
విశాఖ ఎయిర్‌పోర్టులో తనను చంపేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పుడు తన చిన్నాన్నను కూడా హత్య చేశారన్నారు. ఈ మొత్తం ఘటనల వెనుక చంద్రబాబు హస్తం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

First Published:  15 March 2019 1:39 PM IST
Next Story