గుట్టు వీడిన టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్ !
ఈడీ పేరుతో లేఖలు ఫలించలేదు. రెండేళ్ల కిందట ఈడీ ఓ లేఖ రాసింది, ఆ లేఖకు సీబీఐ ఏం జవాబు ఇచ్చిందో తెలియదు. తాము దర్యాప్తు చేసిన అంశాలు వివరించిందో లేదో తెలియదు. కేసులో పస లేదని చెప్పిందో తెలియదు. ఈ మధ్యలో కోర్టులో చాలా అంశాలను సీబీఐ ప్రస్తావించింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. ఎన్నికల వేళ జగన్‌పై పాత అస్త్రాన్ని ప్రయోగించిన పచ్చ మీడియా విఫలమైంది. ఈడీ పేరుతో ప్రచురించిన లేఖకు విలువ లేకుండాపోయింది. […]
ఈడీ పేరుతో లేఖలు ఫలించలేదు. రెండేళ్ల కిందట ఈడీ ఓ లేఖ రాసింది, ఆ లేఖకు సీబీఐ ఏం జవాబు ఇచ్చిందో తెలియదు. తాము దర్యాప్తు చేసిన అంశాలు వివరించిందో లేదో తెలియదు. కేసులో పస లేదని చెప్పిందో తెలియదు. ఈ మధ్యలో కోర్టులో చాలా అంశాలను సీబీఐ ప్రస్తావించింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టారు. ఎన్నికల వేళ జగన్‌పై పాత అస్త్రాన్ని ప్రయోగించిన పచ్చ మీడియా విఫలమైంది. ఈడీ పేరుతో ప్రచురించిన లేఖకు విలువ లేకుండాపోయింది. రెండేళ్ల కిందట లేఖతో తాజాగా వార్తలు వండివార్చినా జనం పట్టించుకోలేదు. దీంతో స్టింగ్ ఆపరేషన్‌తో నయా కుట్రకు తెరలేపారు.
తెలుగులో తమకు చాలా చానళ్లు ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బాబు భజన చేసేందుకు 24 గంటలు బృందగానాలు చేసేందుకు ఉన్నాయి. కానీ తమ చానళ్లలో ప్రసారం చేస్తే జనాలు నమ్మరని తెలిసి… ఇంగ్లీష్ చానల్ టైమ్స్ నౌ ను పట్టుకున్నారు.
బీజేపీ, వైసీపీ మధ్య లాలూచీ వ్యవహారం నడుస్తుందని ఎస్టాబ్లిష్ చేసేందుకు తెలుగుదేశం కుట్రలకు తెరలేపింది. తమ మాటలను జనం నమ్మడం లేదని తెలిసి స్టింగ్ ఆపరేషన్ పేరిట ఓ కుట్రను అమలుచేయబోయింది. బీజేపీకి, తమకు మధ్య ఓ అండర్‌స్టాండింగ్ నడుస్తుందని ఓ అనామకుడి చేత కెమెరా ముందు నాటకం ఆడించారు. అతను ఎవరో తెలియదు. పార్టీలో ఆయన పదవి ఏంటో తెలియదు. కానీ అతని చేత నాలుగు మాటలు చెప్పించారు. స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రసారం చేయించారు. తీరా ఇప్పుడు ఆవిషయం చూస్తే టీడీపీ ఆడించిన నాటకం అని బయటపడింది.
ఇటీవలే టీడీపీలో చేరిన వంగవీటి రాధా అనుచరుడు మనోజ్ కొఠారి. విజయవాడ వన్ టౌన్ లో సోం పాపిడి అమ్ముకునే వ్యాపారి. ఇతనికి లక్షా 30 వేల రూపాయిలు ఇచ్చి ఇంగ్లీష్ చానల్‌లో స్టింగ్ ఆపరేషన్ డ్రామా నడిపారు.
బిజేపి అభ్యర్ధులు పోటీ చేసే దగ్గర వై.సి.పి బలం లేని నాయకులను నిల్చోబెడుతుందనేది…ఈ మనోజ్ కోఠారి అనే అతను చెప్పిన మాటలు రికార్డ్ చేసి… దాన్ని స్టింగ్ ఆపరేషన్‌గా కట్టు కథలు అల్లారు.
మనోజ్ కోఠారి ఎవడో తెలియదు. అతనికి వైసీపీకి ఉన్న సంబంధం తెలియదు. కానీ నాటకం మాత్రం ఆడించి వైసీపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నించి… తెలుగుదేశం తమ్ముళ్లే బొక్కా బొర్లా పడ్డారు. బెజవాడ సందుల్లో పరువు పొగొట్టుకున్నారు. కుట్రలు చేయడం ఎవరి పేటెంట్ హక్కో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు.