Telugu Global
Health & Life Style

అల్లం త్రిదోషహరిణి

త్రిదోషాలు అంటే వాతము, పిత్తము, కఫము అని అర్థం. వీటి మూడింటికి విరుగుడు అల్లం. దీనిని అల్లం, అద్రక్, జింజర్ అని కూడ అంటారు. ఇది త్రిదోషహరిణిగా పిలుస్తారు. కొద్దిగా కారంగా ఉంటుంది. మన ఆహారంలో నిత్యం అల్లం ఉంటే ఎటువంటి రోగం దరిచేరదు. పైత్యము, అజీర్ణం వంటివి దరిచేరవు. మలబద్దకము ఉన్నవారికి అల్లం దివ్య ఔషదం. అల్లం, బెల్లం కలిపి తింటే అరచేతులు, అరికాళ్లలో పొరలు ఊడడం తగ్గిపోతుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలుకకు రుచిపోతుంది. […]

అల్లం త్రిదోషహరిణి
X

త్రిదోషాలు అంటే వాతము, పిత్తము, కఫము అని అర్థం. వీటి మూడింటికి విరుగుడు అల్లం. దీనిని అల్లం, అద్రక్, జింజర్ అని కూడ అంటారు. ఇది త్రిదోషహరిణిగా పిలుస్తారు. కొద్దిగా కారంగా ఉంటుంది.

  • మన ఆహారంలో నిత్యం అల్లం ఉంటే ఎటువంటి రోగం దరిచేరదు. పైత్యము, అజీర్ణం వంటివి దరిచేరవు.
  • మలబద్దకము ఉన్నవారికి అల్లం దివ్య ఔషదం.
  • అల్లం, బెల్లం కలిపి తింటే అరచేతులు, అరికాళ్లలో పొరలు ఊడడం తగ్గిపోతుంది.
  • జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలుకకు రుచిపోతుంది. అలాంటప్పుడు కొద్దిగా అల్లం, నిమ్మకాయలో వేసుకుని చప్పరిస్తే నాలుకకు రుచి వస్తుంది.
  • గొంతు పొడి ఆరిపోయినా, కఫము చేరినా సరే కొద్దిగా అల్లం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే, కఫము ఆర్చుకుపోతుంది.
  • గొంతుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే కొద్దిగా అల్లంతో రసం చేసుకుని తాగినా లేక అన్నంలో కలుపుకుని తిన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • అల్లం టీ తాగితే మనసు చురుకుగా ఉంటుంది.
  • సాధ్యమైనంత వరకూ అల్లాన్ని నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవాలి.
  • కొంత మంది అజీర్ణంతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నిమ్మకాయ రసంలో తగినంత ఉప్పు వేసుకుని ఒక రోజంతా నానపెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయ రసం ఇగిరిపోయేంత వరకూ ఎండలో పెట్టి, ఆ ముక్కలను ఓ సీసలో నిల్వ చేసుకుని రోజూ పరిగడుపునే చప్పరిస్తే అజీర్ణం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.
  • అల్లం తేనెలో వేసుకుని అవి బాగా నానిన తర్వాత రోజూ చప్పరిస్తే పైత్యంతో కూడిన సమస్యలు ఉండవు.
First Published:  14 March 2019 8:33 PM GMT
Next Story