ఎన్టీఆర్ క్లోజింగ్ కలెక్షన్.... డిజాస్టర్స్ కా బాప్
రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమా నడుస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా.. టోటల్ తెలుగు సినీచరిత్రలోనే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టింది మహానాయకుడు సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 3 కోట్ల 81 లక్షల రూపాయలు మాత్రమే షేర్ వచ్చింది. […]
రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. రెవెన్యూ పరంగా కూడా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపని ప్రాంతాల్లో మాత్రమే ఈ సినిమా నడుస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా.. టోటల్ తెలుగు సినీచరిత్రలోనే అత్యంత దారుణమైన వసూళ్లు రాబట్టింది మహానాయకుడు సినిమా.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 3 కోట్ల 81 లక్షల రూపాయలు మాత్రమే షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో అయితే మరీ దారుణం. పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదట. అలా అన్ని ఏరియాల్లో ఎలాంటి మిక్స్ డ్ టాక్ లేకుండా, పూర్తిస్థాయిలో డిజాస్టర్ అనిపించుకుంది ఈ సినిమా.
అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. ఏపీలో చాలా ప్రాంతాల్లో ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శించినప్పటికీ ప్రేక్షకులు అటు వైపు చూడలేదు. ఎన్నికల వరకు ఈ సినిమాను థియేటర్లలో ఉంచాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం – రూ. 70 లక్షలు
సీడెడ్ – రూ. 35 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 24 లక్షలు
ఈస్ట్ – రూ. 23 లక్షలు
వెస్ట్ – రూ. 24 లక్షలు
గుంటూరు – రూ. 70 లక్షలు
కృష్ణా – రూ. 25 లక్షలు
నెల్లూరు – రూ. 15 లక్షలు