2015 తర్వాత టీమిండియా తొలి స్వదేశీ సిరీస్ ఓటమి
వన్డే సిరీస్ లోనూ టీమిండియాకు తప్పని కంగారూ దెబ్బ 3-2తో టీమిండియాపై సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఆఖరి వన్డేలో 35 పరుగులతో టీమిండియా ఓటమి ఉస్మాన్ క్వాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియాకు…ఆరో ర్యాంకర్ ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో కంగారూటీమ్ 3-2తో విరాట్ సేనను చిత్తు చేసి దెబ్బకు దెబ్బ తీసింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా […]
- వన్డే సిరీస్ లోనూ టీమిండియాకు తప్పని కంగారూ దెబ్బ
- 3-2తో టీమిండియాపై సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా
- ఆఖరి వన్డేలో 35 పరుగులతో టీమిండియా ఓటమి
- ఉస్మాన్ క్వాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు
వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియాకు…ఆరో ర్యాంకర్ ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాకిచ్చింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా ముగిసిన పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో కంగారూటీమ్ 3-2తో విరాట్ సేనను చిత్తు చేసి దెబ్బకు దెబ్బ తీసింది.
న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా 35 పరుగులతో టీమిండియాను చిత్తు చేసి 2017 తర్వాత… తొలి వన్డే సిరీస్ సాధించింది. అంతేకాదు…టీమిండియా మాత్రం 2015 తర్వాత స్వదేశంలో ఓ సిరీస్ చేజార్చుకోడం ఇదే మొదటిసారి.
ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ క్వాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.