చంద్రబాబు పై విచారణకు జేడీ కుంటి సాకులు చెప్పారు
చంద్రబాబు, మాజీ జేడీ లక్ష్మీనారాయణల ముసుగులు తొలగిపోయాయన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. నిన్నటి వరకు సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలు అని, పతనమైన వ్యవస్థలు అని చెప్పిన చంద్రబాబు… జగన్‌ను దెబ్బతీసేందుకు మాత్రం అదే ఈడీ, సీబీఐ పేరుతో లేఖలను తన పత్రికల్లో ప్రచురిస్తున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈడీ, సీబీఐలు చంద్రబాబు జేబు సంస్థలన్నారామె. చంద్రబాబు విదేశీ పర్యటనలపై ఈడీ ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. జగన్‌ను ఎదుర్కోవడం ఎలాగో తెలియక…. 2014నాటి పాత కథలు మరోసారి చెబుతున్నారని […]
చంద్రబాబు, మాజీ జేడీ లక్ష్మీనారాయణల ముసుగులు తొలగిపోయాయన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ. నిన్నటి వరకు సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలు బొమ్మలు అని, పతనమైన వ్యవస్థలు అని చెప్పిన చంద్రబాబు… జగన్‌ను దెబ్బతీసేందుకు మాత్రం అదే ఈడీ, సీబీఐ పేరుతో లేఖలను తన పత్రికల్లో ప్రచురిస్తున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
ఈడీ, సీబీఐలు చంద్రబాబు జేబు సంస్థలన్నారామె. చంద్రబాబు విదేశీ పర్యటనలపై ఈడీ ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు.
జగన్‌ను ఎదుర్కోవడం ఎలాగో తెలియక…. 2014నాటి పాత కథలు మరోసారి చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ కేసు విషయంలో లక్ష్మీనారాయణ ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శించారో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు.
జేడీ లక్ష్మీనారాయణ సీబీఐ లో ఉన్నప్పుడే జగన్ కేసుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాడని…. అదే సమయంలో చంద్రబాబు అవినీతి విషయంలో విచారణ జరపమని ఆదేశాలు వస్తే…. సిబ్బంది లేరని సాకు చెప్పి చంద్రబాబు పై విచారణ జరపలేదని…. అప్పుడే ఆయన చంద్రబాబు జేబులో మనిషని అర్థమైందని అన్నారామె.
జేడీ లక్ష్మీనారాయణ ఎంత దిగజారి ఆ పదవిని నిర్వహించారంటే…. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలనే ఆ తరువాత ఆయన సీబీఐ రిపోర్టులుగా కోర్టుల్లో సబ్ మిట్ చేశాడని విమర్శించారు.
చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారామె. టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోయింది కాబట్టే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదన్నారు.