Telugu Global
NEWS

టీఆర్ఎస్‌లోకి సబిత.... చేవెళ్లనే టార్గెట్ !

గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మరిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ చెల్లెలుగా…. చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా…. హోం మంత్రిగా పని చేసిన సబిత ఇంద్రారెడ్డి…. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సబిత…. పార్టీ మారాలనే యోచనలో ఉన్నారనే వార్త చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలోనే కాక రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే […]

టీఆర్ఎస్‌లోకి  సబిత....  చేవెళ్లనే టార్గెట్ !
X

గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మరిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మీయ చెల్లెలుగా…. చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా…. హోం మంత్రిగా పని చేసిన సబిత ఇంద్రారెడ్డి…. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సబిత…. పార్టీ మారాలనే యోచనలో ఉన్నారనే వార్త చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గంలోనే కాక రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డిని రంగంలోనికి దింపి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

అయితే సబిత గత ఎన్నికల సమయంలోనే తనకు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు తన కొడుకు కార్తీక్‌కు ఎంపీ సీట్ కావాలని డిమాండ్ చేశారు. కాని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇప్పుడు లోక్‌సభ షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్‌ను పట్టించుకోక పోవడంతో సబిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నుంచి సరైన అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తోంది. గతంలో టీఆర్ఎస్‌లో కొనసాగిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి మారారు. దీంతో మరో రెడ్డి అభ్యర్థి అయితే అక్కడ గట్టి పోటీ ఇవ్వగలడని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్న సబిత కుటుంబం అయితే తప్పక గెలుస్తామనే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే తన దగ్గరి స్నేహితుడైన అసదుద్దీన్ ఓవైసీని పంపి మరీ సబితను పార్టీలోనికి తీసుకొని వస్తున్నారు. ఈరోజు ఉదయం సబితా ఇంద్రారెడ్డి తన ముగ్గురు కుమారులతో కలిసి వెళ్ళి సీఎం కేసీఆర్ ను కలిశారు.

First Published:  13 March 2019 6:19 AM GMT
Next Story