ప్రచారాన్ని ఖండించిన మురళీమోహన్
కేసీఆర్ బెదిరించడం వల్లే పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారన్న చంద్రబాబు, టీడీపీ ప్రచారాన్ని సొంత పార్టీ ఎంపీ మురళీమోహనే ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు. కేసీఆర్ బెదిరిస్తే సినీ ప్రముఖులు పార్టీలు మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సినిమా వాళ్లు ఎవరికీ భయపడే పరిస్థితి ఉండదన్నారు. తాను కూడా కేవలం ట్రస్ట్ అభివృద్ధి కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని… అంతకు మించి మరో కారణం లేదన్నారు. రాజమండ్రి నుంచి తన కోడలును బరిలోకి దింపే అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరో బెదిరిస్తే భయపడే పరిస్థితి […]

కేసీఆర్ బెదిరించడం వల్లే పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు వైసీపీలో చేరుతున్నారన్న చంద్రబాబు, టీడీపీ ప్రచారాన్ని సొంత పార్టీ ఎంపీ మురళీమోహనే ఖండించారు. అలాంటిదేమీ లేదన్నారు.
కేసీఆర్ బెదిరిస్తే సినీ ప్రముఖులు పార్టీలు మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సినిమా వాళ్లు ఎవరికీ భయపడే పరిస్థితి ఉండదన్నారు. తాను కూడా కేవలం ట్రస్ట్ అభివృద్ధి కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని… అంతకు మించి మరో కారణం లేదన్నారు.
రాజమండ్రి నుంచి తన కోడలును బరిలోకి దింపే అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరో బెదిరిస్తే భయపడే పరిస్థితి ఎందుకుంటుందన్నారు మురళీమోహన్.