Telugu Global
NEWS

మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు " జగన్

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జాబితాలో ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని కోరారు. ఇందుకు పార్టీ బూత్‌ లెవల్‌ ఇన్‌చార్జ్‌లు చొరవ చూపాలని కోరారు. సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. యుద్ధం చేస్తున్నది కేవలం చంద్రబాబుతోనే కాదని.. చంద్రబాబు వెనుక ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5…. ఇతర ఎల్లో చానళ్లతోనూ అన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఈ నెలలో చంద్రబాబు చేయని మోసం […]

మనం యుద్ధం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు  జగన్
X

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జాబితాలో ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని కోరారు. ఇందుకు పార్టీ బూత్‌ లెవల్‌ ఇన్‌చార్జ్‌లు చొరవ చూపాలని కోరారు.

సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. యుద్ధం చేస్తున్నది కేవలం చంద్రబాబుతోనే కాదని.. చంద్రబాబు వెనుక ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5…. ఇతర ఎల్లో చానళ్లతోనూ అన్న విషయం గుర్తించుకోవాలన్నారు.

ఈ నెలలో చంద్రబాబు చేయని మోసం ఉండదన్నారు. వాటిని ఎదుర్కోవాలన్నారు. ఓటర్లను చైతన్యవంతం చేయాలని కోరారు. ఓటు నమోదుకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉందని… కాబట్టి ఆలోపు ఓటు ఉందో లేదో చూసుకుని సరిచేసుకోవాలని కోరారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్న విషయాన్ని మహిళలకు వివరించాలన్నారు. డ్వాక్రా మహిళలకు తిరిగి జీరో వడ్డీకే రుణాలు ఇప్పిస్తామన్నారు.

తొమ్మిదేళ్లుగా టీడీపీతో పోరాటం చేస్తున్నామని జగన్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో ఎంతో మంది ఎంతో నష్టపోయారన్నారు. కార్యకర్తలకు తగిలిన ప్రతి గాయం తనకు తగిలినట్టుగానే భావిస్తున్నానని జగన్ చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు పంట వేయడానికి ముందే పెట్టుబడి కింద 12,500 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులకు నెలకు మూడు వేల రూపాయల పించన్ ఇస్తామన్నారు.

First Published:  11 March 2019 12:12 PM IST
Next Story