టీడీపీకి మరో ఎంపీ గుడ్‌బై
టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మరికొందరు ఎంపీలు పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. ఈనేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. తోట కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈసారి ఆరోగ్య కారణాల రిత్యా ఎంపీగా పోటీ చేయలేనని… తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల చంద్రబాబును కలిసి తోట నర్సింహం కోరారు. అయితే జగ్గంపేట టికెట్‌ను జోత్యుల నెహ్రుకే ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తోట […]
టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మరికొందరు ఎంపీలు పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. ఈనేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు.
తోట కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఈసారి ఆరోగ్య కారణాల రిత్యా ఎంపీగా పోటీ చేయలేనని… తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల చంద్రబాబును కలిసి తోట నర్సింహం కోరారు. అయితే జగ్గంపేట టికెట్‌ను జోత్యుల నెహ్రుకే ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తోట ఫ్యామిలీ టీడీపీని వీడేందుకు సిద్దమైంది. వైసీపీలో చేరితే తోట నర్సింహం భార్య వాణికి కాకినాడ సిటీ గానీ లేదా పెద్దాపురం టికెట్ కానీ కేటాయించేందుకు వైసీపీ సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు.