Telugu Global
NEWS

చంద్రబాబు మాటలు విని పెట్టుబడి పెట్టి మోసపోయా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి గురించి చెప్పిన మాటలు విని పెట్టుబడి పెట్టి దెబ్బతినిపోయానంటున్నాడు సన్ షైన్ ప్రొడక్షన్‌ ఎండీ నవీన్ నాయుడు. నవీన్‌ నాయుడి సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో స్డూడియో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు, పథకాలపై డాక్యుమెంట్లను తన స్డూడియోలో చేస్తూ ఉండేవారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునివ్వడంతో సీఎం సొంతూరుకు చెందిన నవీన్ నాయుడు […]

చంద్రబాబు మాటలు విని పెట్టుబడి పెట్టి మోసపోయా
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి గురించి చెప్పిన మాటలు విని పెట్టుబడి పెట్టి దెబ్బతినిపోయానంటున్నాడు సన్ షైన్ ప్రొడక్షన్‌ ఎండీ నవీన్ నాయుడు.

నవీన్‌ నాయుడి సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో స్డూడియో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు, పథకాలపై డాక్యుమెంట్లను తన స్డూడియోలో చేస్తూ ఉండేవారు.

2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునివ్వడంతో సీఎం సొంతూరుకు చెందిన నవీన్ నాయుడు కోటిన్నర రూపాయలతో అమరావతిలో స్డూడియో నిర్మించారు. ఇప్పుడు తనను ప్రభుత్వం మోసం చేసిందని మీడియా ముందుకు వచ్చారు.

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రకటనల తయారీ పని ఉంటుందన్న ఉద్దేశంతో అమరావతిలో వర్చువల్ స్డూడియో నిర్మించిన్నట్టు నవీన్‌ నాయుడు తిరుపతిలో మీడియా ముందు చెప్పారు. ప్రకటనల తయారీ కాంట్రాక్టును సొంతం చేసుకునేందుకు చాలాసార్లు నవీన్‌ నాయుడు టెండర్లలో పాల్గొన్నారు. పలుమార్లు తాను ఎల్‌-1గా నిలిచినా సరే పని మాత్రం ఇవ్వకుండా మోసం చేశారని నవీన్ నాయుడు మీడియా ముందు వాపోయాడు.

పేరుకు టెండర్లు పిలవడం, లంచాలు తీసుకుని కావాల్సిన వారికి పని అప్పగించడం జరిగిందని నవీన్ నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల వ్యవహారంలో అధికారుల నుంచి బిగ్‌ బాస్‌ వరకు ముడుపులు తీసుకునే పనులు అప్పగిస్తారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ప్రకటించారు.

అయితే నవీన్‌ నాయుడు మీడియాకెక్కిన విషయం తెలుసుకున్న నారావారిపల్లెకు చెందిన టీడీపీ సానుభూతిపరులు మీడియా సమావేశం మధ్యలోనే నవీన్‌తో వాగ్వాదానికి దిగారు.

First Published:  11 March 2019 11:47 AM IST
Next Story