Telugu Global
NEWS

"మా" అధ్యక్షుడిగా నరేష్

మూవీ అసోసియేన్ “మా” ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. ఇన్నాళ్లు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు శివాజీపై మరో ప్రముఖ నటుడు నరేష్ ఏకంగా 69 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ప్రముఖ హాస్య నటి హేమ గెలుపొందారు. ఏ ప్యానెల్ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన హేమ శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డిపై సంచలన విజయం సాధించారు. మా ఎన్నికల కోసం […]

మా అధ్యక్షుడిగా నరేష్
X

మూవీ అసోసియేన్ “మా” ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. ఇన్నాళ్లు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు శివాజీపై మరో ప్రముఖ నటుడు నరేష్ ఏకంగా 69 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఉపాధ్యక్షురాలిగా ప్రముఖ హాస్య నటి హేమ గెలుపొందారు. ఏ ప్యానెల్ నుంచి కాకుండా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన హేమ శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేసిన ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డిపై సంచలన విజయం సాధించారు.

మా ఎన్నికల కోసం సినీ తారలు రెండు ప్యానళ్లుగా విడిపోయి పోటీ చేశారు. ఇందులో ఒకటి ఇంతవరకూ అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ప్యానల్ కాగా మరొకటి నటుడు నరేష్ ప్యానెల్. ఈ ప్యానెల్ నుంచి ఈసారి ఎక్కువ మంది అభ్యర్ధులు విజయం సాధించడం గమనార్హం. శివాజీ రాజా ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేసిన శ్రీకాంత్…. నరేష్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన నటుడు రాజశేఖర్ చేతిలో పరాజయం పాలయ్యారు.

అలాగే ఈ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత రాజశేఖర్…. శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేసిన హాస్య నటుడు రఘుబాబుపై విజయం సాధించారు. ఇక ట్రెజరర్ గా శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేసిన రాజీవ్ కనకాల విజయం సాధించారు. ఈయన మరో నటుడు కోట శంకర రావుపై విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీలుగా నరేష్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన శివబాలాజీ, గౌతం రాజు విజయం సాధించారు.

ఎంతో ప్రతిష్టాత్మంగా మారిన ఈ ఎన్నికలలో తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయింది. మెగాస్టార్ చిరంజీవి తెర వెనుక మద్దతు పలికారు. ఆయన సోదరుడు నాగబాబు మాత్రం నరేష్ ప్యానెల్ కు బహిరంగంగానే మద్దతు పలికారు. గత కొంత కాలంగా మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ముఖ్యంగా నిధుల దుర్వినియోగంపై మా అసోసియేష్ రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఒక దశలో ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకూ వివాదం వెళ్లింది. అయితే సీనీ పెద్దలు కలుగజేసుకుని వివాదం మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడంతో ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా ప్యానెల్ అనూహ్యంగా పరాజయం పాలైంది. తన ప్యానెల్ విజయానికి సహరించిన వారందరికి…. కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైన నరేష్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు తన ఈ విజయాన్ని తన గురువు, దివంగత దర్శకుడు జంథ్యాలకు, మరో దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావుకు, తన తల్లి విజయనిర్మలకు అంకింతం చేస్తున్నట్లు ప్రకటించారు.

First Published:  11 March 2019 1:51 AM IST
Next Story