మొహాలీ వన్డేలో కంగారూల రికార్డ్ చేజింగ్
359 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేధించిన ఆసీస్ టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు భారతగడ్డపై భారీలక్ష్యాన్ని చేధించిన ఏకైకజట్టు ఆసీస్ ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో ఆతిథ్య టీమిండియా ఓటమి వెంట ఓటమితో ఆత్మరక్షణలో పడిపోయింది. 359 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకోడంలో విఫలమయ్యింది. మొహాలీ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా […]
- 359 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేధించిన ఆసీస్
- టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు
- ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 359 పరుగులు
- భారతగడ్డపై భారీలక్ష్యాన్ని చేధించిన ఏకైకజట్టు ఆసీస్
ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో ఆతిథ్య టీమిండియా ఓటమి వెంట ఓటమితో ఆత్మరక్షణలో పడిపోయింది. 359 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకోడంలో విఫలమయ్యింది.
మొహాలీ వేదికగా ముగిసిన నాలుగో వన్డేలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగుల భారీస్కోరు సాధించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ మొదటి వికెట్ కు 193 పరుగుల భాగస్వామ్యంతో కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రత్యర్థి ఎదుట 359 పరుగుల లక్ష్యం ఉంచడంలో ప్రధానపాత్ర వహించారు.
అయితే ..కంగారూ టీమ్ మాత్రం కొండంత లక్ష్యాన్ని కేవలం 47.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సాధించడం ద్వారా 4 వికెట్ల విజయంతో సిరీస్ ను 2-2తో సమం చేసింది.
స్వదేశంలో టీమిండియా 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోడం ఇదే మొదటిసారి. అంతేకాదు…భారత గడ్డపై 359 పరుగుల భారీ టార్గెట్ ను అలవోకగా చేధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లో చేరింది.
ఆస్ట్రేలియా యువఆటగాడు ఆస్టన్ టర్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని ఆఖరి వన్డే ఈనెల 13న న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరుగుతుంది.
భారీ వైఫల్యం….
స్వదేశంలో జరిగిన వన్డేల్లో టీమిండియా 350కి పైగా స్కోర్లు సాధించీ…ఓటమి పాలుకావడం ఇదే మొదటిసారి కాదు. హైదరాబాద్ వేదికగా జరిగిన 2009 సిరీస్ మ్యాచ్ లో టీమిండియా.. 49.4 ఓవర్లలో 347 పరుగుల భారీ స్కోరు సాధించినా… ఆస్ట్రేలియా ఎదుట 348 పరుగుల భారీ లక్ష్యం ఉంచినా నిలబెట్టుకోలేకపోయింది.
మొహాలీ వన్డేలోనూ అదే సీన్
అంతేకాదు…మొహాలీ వేదికగా ముగిసిన 2019 సిరీస్ నాలుగో వన్డేలో సైతం టీమిండియా 9 వికెట్లకు 358 పరుగుల రికార్డు స్కోరు సాధించి…కాపాడుకోలేకపోయింది. యువఆటగాడు యాష్టన్ టర్నర్ 43 బాల్స్ లో 5 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 84 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో…కంగారూ టీమ్ రికార్డు చేజింగ్ ను 6 వికెట్ల నష్టానికే సాధించగలిగింది.
టీమిండియా ప్రత్యర్థిగా భారీ చేజింగ్….
టీమిండియా ప్రత్యర్థిగా భారీ లక్ష్యాలను అలవోకగా చేధించిన జట్లలో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ ఉన్నాయి. మొహాలీ వన్డేలో ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 359 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేరుకొని… భారత గడ్డపై అత్యధిక స్కోరు చేధించిన జట్టుగా రికార్డుల్లో చేరింది.
2017లో ఓవల్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో టీమిండియా పై శ్రీలంక 322 పరుగులు 48.4 ఓవర్లలోనే సాధించింది.
2017 సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా పై పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 322 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టానికే చేరుకొంది.
భారత్ ప్రత్యర్థిగా 310 పరుగులకు పైగా లక్ష్యాలను పాక్ జట్టు మూడుసార్లు అధిగమించడం విశేషం.