Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న ఎక్సైజ్ ఆదాయం

తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయ్. దీంతో కాటన్ ల కొద్ది బీరులు, మద్యం ఏరులై పారుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి ప్రారంభం కాక ముందే ఎక్సైజ్ ఆదాయం రెండు రాష్ట్రాలకు భారీగా వస్తోందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికల తేదీ ప్రకటించడంతో ఇక రెండు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు మరింత జోరు అందుకోనున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్దులు పాత […]

తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న ఎక్సైజ్ ఆదాయం
X

తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయ్. దీంతో కాటన్ ల కొద్ది బీరులు, మద్యం ఏరులై పారుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేసవి ప్రారంభం కాక ముందే ఎక్సైజ్ ఆదాయం రెండు రాష్ట్రాలకు భారీగా వస్తోందని అధికారులు చెబుతున్నారు.

దీనికి తోడు లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికల తేదీ ప్రకటించడంతో ఇక రెండు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు మరింత జోరు అందుకోనున్నాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్దులు పాత తారీఖులు, వోచర్లతో భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నెల రోజులు మద్యం అమ్మకాలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం తయారీ కేంద్రాలు, మద్యం సరఫరా చేసే డిపోలు కూడా మందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోను కనీసం 5000 నుంచి 8000 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగనున్నాయని ప్రాధమిక అంచన.

మరోవైపు ఎక్సైజ్ అధికారులు అనధికారికంగా మద్యం షాపులకు లక్ష్యాలు నిర్దేశించే పనిని ప్రారంభించారు. ఈ నెల రోజుల పాటు గతంతో పోలిస్తే 100 నుంచి 150 శాతం మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండాలని ఆదేశించినట్లు చెబుతున్నారు.

First Published:  11 March 2019 12:50 AM IST
Next Story