Telugu Global
NEWS

వాడిపోయిన బాబు ముఖం: ఎన్నికల తేదీ కారణమా!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖం వాడిపోయింది. ఎక్కడ ఎన్నికలు వస్తున్నాయన్నా లెక్కలేనంత ఉత్సాహంతో… కొత్త కొత్త వ్యూహరచనలతో వెలిగిపోయే చంద్రబాబు నాయుడు ముఖం ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో తేదీలను ప్రకటించగానే డీలా పడిపోయింది. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ దేశవ్యాప్తంగానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల తేదీలను ప్రకటించారు. గతంలోలా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఒక రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రోజు కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 11వ […]

వాడిపోయిన బాబు ముఖం: ఎన్నికల తేదీ కారణమా!
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖం వాడిపోయింది. ఎక్కడ ఎన్నికలు వస్తున్నాయన్నా లెక్కలేనంత ఉత్సాహంతో… కొత్త కొత్త వ్యూహరచనలతో వెలిగిపోయే చంద్రబాబు నాయుడు ముఖం ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో తేదీలను ప్రకటించగానే డీలా పడిపోయింది.

ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ దేశవ్యాప్తంగానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల తేదీలను ప్రకటించారు. గతంలోలా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఒక రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రోజు కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయాన్ని ఇచ్చారు. ఈ చర్యతో చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన ముఖంలోని హావ భావాలను వెల్లడించని చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిన వెంటనే హావ భావాలనే కాదు ఆవేదనను కూడా దాచుకోలేకపోయారు.

ఎన్నికల కమిషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ప్రకటించిన గంటన్నర తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ సమావేశం దాదాపు గంటన్నర పైగా జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుని చూసిన వారంతా డీలా పడిపోయిన ముఖం… ఎన్నికలంటే కనిపించే కనీస ఉత్సాహం కూడా లేకుండా గంటన్నరకు పైగా మాట్లాడారు.

ఈ విలేకరుల సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… “ప్లీజ్ నన్ను గెలిపించండి. నేను అధికారంలోకి రావడం చారిత్రక అవసరం. ఆ ముగ్గురు నాయకులు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు. నాకు పట్టం కట్టండి. అధికారాన్ని అందించండి” అంటూ ప్రాధేయ పడడం, బ్రతిమిలాడడం, వేడుకోవడం వంటివి చేశారు.

విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలోనే వివిధ సర్వేలు కూడా తనకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడం చంద్రబాబు నాయుడు లో అసహనాన్ని మరింత ఎక్కువ చేసింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు లో ఇలాంటి డీలా తత్వం ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

లోపల ఎంత ఇబ్బందులు, కష్టనష్టాలు వస్తున్నా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో తొలిసారిగా డీలా పడిపోయారు అని తెలుగుదేశం నాయకులు, అధికారులు, విలేకరుల సమావేశం చూసిన సీనియర్ జర్నలిస్టులు కూడా ” పాపం చంద్ర బాబు” అంటూ పెదవి విరుస్తున్నారు.

First Published:  10 March 2019 10:35 PM GMT
Next Story