Telugu Global
Cinema & Entertainment

ఆర్య, సాయేషా ఒక్కటయ్యారు

మరో ప్రేమ కథ సుఖాంతం అయింది. కోలీవుడ్ హాట్ జంట ఆర్య, సాయేషా పెళ్లితో ఒకటైంది. హైదరాబాద్ లో వీళ్ల వివాహం అట్టహాసంగా జరిగింది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు వీళ్ల వివాహ వేడుక కన్నులపండువగా జరిగింది. కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లలో కార్తి, సూర్య, అల్లు అర్జున్, రానా లాంటి హీరోలున్నారు. గజనీకాంత్ అనే సినిమాతో ఆర్య, సాయేషాకు పరిచయమైంది. అదే వాళ్ల తొలిపరిచయం అయినప్పటికీ, […]

ఆర్య, సాయేషా ఒక్కటయ్యారు
X

మరో ప్రేమ కథ సుఖాంతం అయింది. కోలీవుడ్ హాట్ జంట ఆర్య, సాయేషా పెళ్లితో ఒకటైంది. హైదరాబాద్ లో వీళ్ల వివాహం అట్టహాసంగా జరిగింది. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు వీళ్ల వివాహ వేడుక కన్నులపండువగా జరిగింది. కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లలో కార్తి, సూర్య, అల్లు అర్జున్, రానా లాంటి హీరోలున్నారు.

గజనీకాంత్ అనే సినిమాతో ఆర్య, సాయేషాకు పరిచయమైంది. అదే వాళ్ల తొలిపరిచయం అయినప్పటికీ, బాగా కలిసిపోయారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారని, ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ కోలీవుడ్ లో అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. ఎట్టకేలకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టింది ఈ జంట.

ప్రేమను నిర్థారించిన రోజే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు ఆర్య, సాయేషా. అలా చెప్పినట్టుగానే హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే చెన్నైలో కోలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.

First Published:  11 March 2019 11:10 AM IST
Next Story