Telugu Global
Cinema & Entertainment

సినిమాల్లోకి విజయశాంతి రీఎంట్రీ

ఓవైపు రాజకీయ నాయకులంతా ఎన్నికల హడావుడిలో బిజీ అయిపోయారు. టిక్కెట్ల కోసం పార్టీ ఆఫీసుల చుట్టూ, అధినేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారు. ఇలా పొలిటీషియన్లంతా రాజకీయాలతో బిజీ అవుతుంటే, విజయశాంతి మాత్రం సినిమాల్లో రీఎంట్రీ గురించి ఆలోచిస్తున్నారు. అవును.. అన్నీ కుదిరితే విజయశాంతి మరోసారి వెండితెరపైకి రాబోతోంది. ఈసారి ఆమె రీఎంట్రీ ఇచ్చే సినిమా ఏకంగా మహేష్ బాబుది కావడం విశేషం. జులై నుంచి అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ […]

సినిమాల్లోకి విజయశాంతి రీఎంట్రీ
X

ఓవైపు రాజకీయ నాయకులంతా ఎన్నికల హడావుడిలో బిజీ అయిపోయారు. టిక్కెట్ల కోసం పార్టీ ఆఫీసుల చుట్టూ, అధినేతల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తున్నారు. ఇలా పొలిటీషియన్లంతా రాజకీయాలతో బిజీ అవుతుంటే, విజయశాంతి మాత్రం సినిమాల్లో రీఎంట్రీ గురించి ఆలోచిస్తున్నారు. అవును.. అన్నీ కుదిరితే విజయశాంతి మరోసారి వెండితెరపైకి రాబోతోంది. ఈసారి ఆమె రీఎంట్రీ ఇచ్చే సినిమా ఏకంగా మహేష్ బాబుది కావడం విశేషం.

జులై నుంచి అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు మహేష్ బాబు. అనీల్ రావిపూడి స్టయిల్ లోనే పక్కా కమర్షియల్ గా, కంప్లీట్ కామెడీ టచ్ తో ఈ సినిమా రాబోతోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాల్లో మంచి రీఎంట్రీ కోసం చూస్తున్న విజయశాంతి కూడా, మహేష్ బాబు సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

దిల్ రాజు, అనీల్ సుంకర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే, విజయశాంతి రీఎంట్రీపై ఓ క్లారిటీ రానుంది.

First Published:  10 March 2019 9:12 AM IST
Next Story