మే 23న కౌంటింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అరోరా చెప్పారు. 11 ఏప్రిల్ మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 18న ఉంటుంది. మూడో విడత పోలింగ్ ఏప్రిల్ 23న, నాలుగో విడత పోలింగ్ 29 ఏప్రిల్, ఐదో విడత పోలింగ్ మే 6న నిర్వహిస్తారు. ఆరో విడత పోలింగ్ […]
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అరోరా చెప్పారు. 11 ఏప్రిల్ మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 18న ఉంటుంది. మూడో
విడత పోలింగ్ ఏప్రిల్ 23న, నాలుగో విడత పోలింగ్ 29 ఏప్రిల్, ఐదో విడత పోలింగ్ మే 6న నిర్వహిస్తారు. ఆరో విడత పోలింగ్ మే 12, ఏడో విడత పోలింగ్ 19న జరుగుతుంది. మే 23న మొత్తం కౌంటింగ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఒకేసారి కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు అన్ని రాష్ట్రాల అధికారులతో మాట్లాడినట్టు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ ఆరోరా చెప్పారు చెప్పారు. వాతావరణ శాఖ నివేదికలు కూడా తెప్పించుకున్నట్టు వివరించారు. చాలా రోజుల నుంచే ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దేశంలో 18 నుంచి 19 ఏళ్ల లోపు ఓటర్లు కోటి 50 లక్షల మంది ఉన్నట్టు చెప్పారు. ఎన్నికల నిర్వాహణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలకు భారత్
దిక్సూచిగా ఉందన్నారు.
దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు అరోరా చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8.4కోట్ల మంది కొత్తగా ఓటర్లు చేరారన్నారు. దేశ వ్యాప్తంగా 10లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఓటు వేయగానికి ఓటరు గుర్తింపు కార్డులతో పాటు 11 కార్డులను గుర్తింపు కార్డులుగా అనుమితిస్తున్నట్టు చెప్పారు.
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ముద్రిస్తామన్నారు. అఫిడవిట్‌లో అభ్యర్థులు పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని.. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే నామినేషన్ తిరస్కరిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. సోషల్ మీడియాపైనా పర్యవేక్షణ ఉంటుందని అరోరా చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే
చర్యలుంటాయన్నారు.