Telugu Global
NEWS

పరిటాల సునీత సీటు వదులుకోవాల్సిందేనా?

అనంతపురం జిల్లాలో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించడంలో జేసీ బ్రదర్స్ విజయం సాధించారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ అనంతపురం ఎంపీగా బరిలో దిగుతున్నారు. ఈనేపథ్యంలో తన కుమారుడి విషయంలో పరిటాల సునీత టెన్షన్ పడుతున్నారు. ఈసారి తన కుమారుడిని బరిలో దింపకపోతే జిల్లా రాజకీయాల్లో జేసీ వారసుల కంటే జూనియర్ అయిపోతాడని భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా ఏదో ఒక స్థానం నుంచి కుమారుడిని పోటీ చేయించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నాలు […]

పరిటాల సునీత సీటు వదులుకోవాల్సిందేనా?
X

అనంతపురం జిల్లాలో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించడంలో జేసీ బ్రదర్స్ విజయం సాధించారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా, దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ అనంతపురం ఎంపీగా బరిలో దిగుతున్నారు.

ఈనేపథ్యంలో తన కుమారుడి విషయంలో పరిటాల సునీత టెన్షన్ పడుతున్నారు. ఈసారి తన కుమారుడిని బరిలో దింపకపోతే జిల్లా రాజకీయాల్లో జేసీ వారసుల కంటే జూనియర్ అయిపోతాడని భావిస్తున్నారు. అందుకే ఎలాగైనా ఏదో ఒక స్థానం నుంచి
కుమారుడిని పోటీ చేయించేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతలను కలిసి చంద్రబాబు వద్ద తన కుమారుడి టికెట్‌పై సిఫార్సు చేయాల్సిందిగా కోరుతున్నారు.

పరిటాల శ్రీరామ్ కూడా కాలువ శ్రీనివాస్ లాంటి వారి ఇంటికి వెళ్లి తనకు టికెట్ ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలని కోరారు. పరిటాల సునీత రాప్తాడు నుంచి, పరిటాల శ్రీరాం కల్యాణ్ దుర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు.

అయితే కల్యాణదుర్గం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి కాకుండా ఈసారి ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబుకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. దీంతో పరిటాల శ్రీరాంకు రాప్తాడు నుంచి పోటీ చేయడం తప్ప మరో దారి లేకుండా పోయింది.

కుమారుడు జిల్లా రాజకీయాల్లో జూనియర్ కాకుండా ఉండాలని భావిస్తున్న పరిటాల సునీత … కుమారుడి కోసం తన స్థానాన్నే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. తన కుమారుడి కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటానని… తన కుమారుడికి
టికెట్ ఇచ్చేలా చంద్రబాబును ఒప్పించాలని పలువురు సీనియర్ల ద్వారా పరిటాల సునీత ప్రయత్నాలు చేస్తున్నారు.

First Published:  10 March 2019 2:19 AM IST
Next Story